ETV Bharat / sitara

'జగదేకవీరుడు అతిలోకసుందరి' కథ అలా పుట్టింది

మెగాస్టార్ చిరంజీవి అద్భుత దృశ్యకావ్యం 'జగదేకవీరుడు అతిలోకసుందరి'కి సంబంధించిన తొలి రహస్యాన్ని చెప్పాడు హీరో నాని.

author img

By

Published : May 6, 2020, 12:28 PM IST

'జగదేకవీరుడు అతిలోకసుందరి' కథా అలా పుట్టింది
చిరంజీవి శ్రీదేవి

క్లాసిక్ 'జగదేకవీరుడు అతిలోకసుందరి'కి సంబంధించిన తొలి రహస్యాన్ని హీరో నాని చెప్పేశాడు. అసలు ఈ ఆలోచన ఎవరికొచ్చింది? కథ ఎక్కడ పుట్టింది? తదితర విశేషాలను వెల్లడించాడు. ఈ వీడియోను వైజయంతీ మూవీస్ ట్వీట్ చేసింది. ఈ నెల 9వ తేదీకి సినిమాకు '30 ఏళ్లు' పూర్తవుతున్న సందర్భంగా దీనిని పోస్ట్ చేసింది. ఆ మూడింట్లో మొదటి వీడియోనే ఇది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కోడైరెక్టర్ శ్రీనివాస చక్రవర్తి, దర్శకుడు కె.రాఘవేంద్రరావు తిరుపతికి వెళ్లిన సమయంలో ఈ కథ పుట్టిందని చెప్పిన నాని.. ఇందులోని తన కాస్ట్యూమ్స్​ స్వయంగా శ్రీదేవి తయారు చేసుకున్నారని తెలిపాడు. జంధ్యాల, యండమూరి వీరేంద్రనాథ్, సత్యమూర్తి, విజయేంద్ర ప్రసాద్, క్రేజీ మోహన్ వంటి ప్రముఖ రచయతలు కలిసి ఈ కథకు ఓ రూపం తీసుకొచ్చారని అన్నాడు. వీటితో పాటు చాలా ఆసక్తికర విషయాల్ని ఈ వీడియోలో వెల్లడించాడు.

ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి హీరోహీరోయిన్లుగా నటించారు. ఇళయారాజా సంగీతమందించారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. అప్పటి వరకు ఉన్న రికార్డులను 'జగదేకవీరుడు అతిలోకసుందరి' ఆ సమయంలోనే తిరగరాసింది. చిరు-శ్రీదేవిల కెరీర్​లో మైలురాయిగా నిలిచిపోయింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.