కాశ్వీ నాయర్ దర్శకత్వంలో మూడు తరాల ప్రేమకథా నేపథ్యంగా బాలీవుడ్లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో అర్జున్ కపూర్, రకుల్‌ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రంలో మరో ఇద్దరు బాలీవుడ్ నటులు చేరారు. జాన్ అబ్రహం, అదితీరావు హైదరీలు కీలకపాత్రలు పోషించనున్నారని తెలిపింది చిత్రబృందం.
ఈ చిత్రానికి జాన్ అబ్రహం, నిఖిల్ అడ్వాణీలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇండోర్ షూటింగ్‌లో ఒక వారం పాటు జాన్, అదితీలు పాల్గొననున్నారు. మళ్లీ అక్టోబర్‌లో అవుట్‌డోర్ షూటింగ్‌లో హీరోహీరోయిన్లతో కలిసి పాల్గొంటారు. అదితి .. అర్జున్ కపూర్‌కు అమ్మమ్మ పాత్రలో నటించనుందని సమాచారం.
-
To new beginnings... 🤍@TheJohnAbraham @arjunk26 @Rakulpreet @Neenagupta001 @kaachua @monishaadvani @madhubhojwani @nikkhiladvani @itsBhushanKumar @iamDivyaKhosla #KrishanKumar @TSeries @EmmayEntertain @johnabrahament pic.twitter.com/q0vDiWewl4
— Aditi Rao Hydari (@aditiraohydari) August 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">To new beginnings... 🤍@TheJohnAbraham @arjunk26 @Rakulpreet @Neenagupta001 @kaachua @monishaadvani @madhubhojwani @nikkhiladvani @itsBhushanKumar @iamDivyaKhosla #KrishanKumar @TSeries @EmmayEntertain @johnabrahament pic.twitter.com/q0vDiWewl4
— Aditi Rao Hydari (@aditiraohydari) August 26, 2020To new beginnings... 🤍@TheJohnAbraham @arjunk26 @Rakulpreet @Neenagupta001 @kaachua @monishaadvani @madhubhojwani @nikkhiladvani @itsBhushanKumar @iamDivyaKhosla #KrishanKumar @TSeries @EmmayEntertain @johnabrahament pic.twitter.com/q0vDiWewl4
— Aditi Rao Hydari (@aditiraohydari) August 26, 2020
ప్రత్యేక చిత్రంగా ఉంటుంది
"జాన్ అబ్రహం నేను 1946-47 కాలం నాటి పాత్రల్లో నటిస్తాం. ఇలాంటి చిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అందుకే చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్నా" అని అదితి తెలిపింది. నటుడు జాన్ అబ్రహం స్పందిస్తూ.. "నేను స్క్రిప్టు విన్నప్పుడు ఇది ఒక ప్రత్యేకమైన చిత్రంగా ఉంటుందని అనుకున్నా. అయితే కాశ్వీ నాయర్ నటించమని అడగ్గానే, వద్దు అని చెప్పడానికి కష్టంగా అనిపించింది" అన్నాడు.