దేశంలో కొద్దికాలంగా కరోనా వ్యాప్తి స్థిరంగా ఉంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. ఈ క్రమంలోనే అన్ని రంగాల వారు టీకాలు తీసుకుని తమ పని తాము చేసుకుంటున్నారు. చిత్రసీమ కూడా షూటింగ్లతో బిజీగా గడుపుతోంది.
ఈ క్రమంలో తాను కరోనా బారిన పడ్డానంటూ ప్రముఖ దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్(farah khan movies) సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. తాను రెండు డోసులు వేయించుకుని, రెండు టీకాలు తీసుకున్నవారితోనే పనిచేస్తున్నప్పటికీ వైరస్ సోకడం ఆశ్చర్యమేసిందని వెల్లడించారు. తనతో సన్నిహితంగా ఉన్నవారు టెస్టు చేయించుకోవాలని సూచించారు. త్వరలోనే కోలుకుంటానని చెప్పారు.
కరోనా సోకకముందు ఫరా ఖాన్.. ప్రముఖ 'జీ కామెడీ షో' షూటింగ్లో పాల్గొన్నారు. దీంతోపాటు ఇటీవల 'కౌన్ బనేగా కరోడ్పతి' 13వ సీజన్ కోసం హీరోయిన్ దీపికా పదుకొణెతో షూటింగ్లో పాల్గొన్నారు. 'సూపర్ డ్యాన్స్ర్ 4'కు అతిథిగానూ విచ్చేశారు.
ఇదీ చూడండి: Tuck Jagadish: అలరిస్తున్న 'టక్ జగదీష్' ట్రైలర్