బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్.. వచ్చే ఏడాది ఈద్ బరి నుంచి తప్పుకున్నాడు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో నటిస్తున్న 'ఇన్షా అల్లా' సినిమాను వాయిదా వేస్తున్నట్లు ట్వీట్ చేశాడు. అయితే అదే సమయానికి మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తానని చెప్పాడు.
"సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఈద్‌కు రావట్లేదు. కానీ ఆ పండుగకు నేను మిమ్మల్ని కలుస్తాను". -ట్విట్టర్లో సల్మాన్‌ఖాన్
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత సల్మాన్‌తో పనిచేస్తున్నాడు భన్సాలీ. ఈ హీరోతో 1996లో తీసిన 'కామోషీ-ద మ్యూజికల్' సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు సంజయ్. ఆ తర్వాత వీరిద్దరూ 'హమ్ దిల్ దే చుకే సనమ్' కోసం కలిసి పనిచేశారు. ఇందులో ఐశ్వర్యరాయ్, అజయ్ దేవగణ్ నటించారు. భన్సాలీ రూపొందించిన 'సావరియా'లో అతిథి పాత్ర పోషించాడు సల్మాన్.
ఇది చదవండి: కొమురం భీంగా ఎన్టీఆర్ కనిపించేది ఆరోజే..!