ETV Bharat / sitara

అలా చెప్పుకునేందుకు ఎక్కువ ఇష్టపడతా: బుచ్చిబాబు - దర్శకుడు శివ నిర్వాణ సినిమాలు

దర్శకుడు సుకుమార్​(Sukumar movies).. తనకు పాఠాలు బోధించిన అధ్యాపకుడే కాకుండా జీవిత పాఠాలు నేర్పిన మార్గదర్శి అని చెప్పాడు 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు(Buchi babu director). ఇవాళ(సెప్టెంబరు 5) గురుపూజోత్సవం సందర్భంగా తన కెరీర్​ సహా గురువు గురించి పలు విషయాల గురుంచి మాట్లాడారు. అవన్నీ ఆయన మాటల్లోనే...

sukumar
సుకుమార్​
author img

By

Published : Sep 5, 2021, 7:30 AM IST

Updated : Sep 5, 2021, 8:03 AM IST

విద్యార్థి మొబైల్‌ లాంటి వాడైతే
చదువు ఇంటర్నెట్‌ లాంటిది...
గురువు యాంటివైరస్‌లాంటోడు...
వైరస్‌లాంటి చెడు విద్యార్థిని చుట్టుముట్టకుండా కాచుకుంటాడు.

విద్యార్థి విద్యుత్తు లాంటి వాడైతే..
సమాజం బల్బ్‌ లాంటిది..
గురువు తీగలాంటోడు...
ఆ సమాజానికి వెలుగిచ్చేలా విద్యార్థిని ముందుకు నడిపిస్తాడు.

విద్యార్థి నదిలాంటి వాడైతే...
దేశం పొలం లాంటిది..
గురువు ఆనకట్టలాంటోడు...
విద్యార్థి సరైన మార్గంలో ప్రవహించేలా చేసి దేశాన్ని పండిస్తాడు.
మనమందరం... వక్రమార్గంలో నడవకుండా, సమాజానికి ఉపయోగపడేలా మనల్ని మలిచిన గురువులందరికీ వందనాలు. అలాంటి మార్గదర్శుల గురించి... దర్శకుల మాటల్లో...

అందుకు గర్వపడతాను

"వీడ్ని నా శిష్యుడని చెప్పగలను. ఎందుకంటే నేను ఇతనికి పాఠాలు చెప్పిన గురువును."

- అగ్ర దర్శకుడు సుకుమార్‌

"నేను దర్శకుడిని అని చెప్పుకోవడానికంటే.. సుక్కు సార్‌ శిష్యుడని చెప్పుకొనేందుకు ఎక్కువ ఇష్టపడతా."

- దర్శకుడు బుచ్చిబాబు

సుకుమార్‌(Sukumar movies) నాకు పాఠాలు బోధించిన అధ్యాపకుడే కాదు.. జీవిత పాఠాలు నేర్పిన మార్గదర్శి అంటూ చెప్పుకొచ్చాడు బుచ్చిబాబు(Buchi babu Uppena). గురుపూజోత్సవం సందర్భంగా ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

ఎలాంటి అధ్యాపకుడంటే..!: ఇంటర్‌ చదివే రోజుల్లో మాకు ఆయన గణితం బోధించేవారు. ఏదైనా ఒక పాఠం చెప్పేటప్పుడు.. ఎవరూ నోట్స్‌ రాసుకోవద్దని చెప్పేవారు. దానికి ప్రత్యేకంగా సమయం ఇచ్చి నోట్స్‌ ఇచ్చేవారు. సుక్కు సార్‌.. ఎలాంటి క్లిష్టమైన లెక్కనైనా.. సినిమాలా కళ్లకు కట్టినట్లు చెప్పి మా బుర్రల్లోకి ఎక్కించేవారు. పాఠం చెప్పడం పూర్తైన తర్వాత ఇది ఎవరికైనా అర్థం కాకుంటే చేతులు ఎత్తండని అడిగేవారు. తరగతిలో ఎవరూ స్పందించకపోతే.. రే.. మీకందరికీ అర్థమైనా.. ఒక్కడికి మాత్రం అర్థం కాలేదురా.. వాడి పేరు సుక్కు. వాడి కోసం ఇంకోసారి చెబుతా..! అని పాఠం మొదలుపెట్టేవాడు.

అద్భుతమైన గురువు..: నేను డిగ్రీ పూర్తిచేసి ఆయన దగ్గరికి వచ్చాను. 'మీ అసిస్టెంటుగా చేరాలంటే ఏం చేయాలి?' అని అడిగాను. 'ముందు నువ్వు ఎంబీఏ పూర్తి చేసి రా' అన్నారు. ఎంబీఏ చదివేటప్పుడు 'జగడం' చిత్రీకరణ జరుగుతోంది. ఆ షూటింగ్‌ దగ్గరికీ రోజు వెళ్లేవాడిని. ఆయన మాట ప్రకారం ఎంబీఏ అయ్యాక వచ్చా. '100 పర్సెంట్‌ లవ్‌' సినిమా నుంచి అసిస్టెంటుగా చేరిపోయా. 'నాన్నకు ప్రేమతో', 'వన్‌ నేనొక్కడినే', 'రంగస్థలం' ఇలా సుక్కు సర్‌ దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకొనే అవకాశం దక్కింది. చిత్రీకరణ సమయంలో ఏదైనా అనుమానం వచ్చి ఈ షాట్‌ ఎందుకని అడిగితే.. షూటింగ్‌ నిలిపేసి అయినా వివరించేవారు. అది నాకు ఎంతో ఉపయోగపడింది. ఆయన 'స్క్రిప్ట్‌' ఎంత పకడ్బందీగా ఉంటుందో తెలుసు కదా! అదే నేనూ అనుసరిస్తుంటా. ఆయన నిద్రపోతున్నా స్క్రిప్ట్‌ గురించి ఆలోచిస్తుంటారు.

జీవితమిచ్చిన మార్గదర్శి: నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే ఆయనే కారణం. నా వ్యక్తిగత జీవితంలోనూ మా గురువు సుక్కు సార్‌ని 99శాతం ఫాలో అయిపోతుంటా. ఆయన ఎంతోమంది విద్యార్థులను ఉచితంగా చదివిస్తున్నారు. ఇటీవలే చదివిన పాఠశాలకు భవనం కట్టించారు. ఆయన శిష్యులకే కాదు.. శిష్యుల స్నేహితులకూ సాయం చేస్తుంటారు. నేను అసిస్టెంటుగా ఉన్నప్పుడు నా స్నేహితుడి కుటుంబానికి కష్టం వచ్చింది. అతని పిల్లల్ని కూడా ఆయనే సొంతంగా చదివిస్తున్నారు. మా గురువు మనసున్న మనిషి. సుక్కుసార్‌ శిష్యుడినని చెప్పుకోవడానికి నేను ఎప్పుడూ గర్వపడతాను.

Buchi babu
బుచ్చిబాబు

'ఆ విలువలు జీవితాంతం ఉంటాయి'

"నా జీవితంలో చాలా గొప్ప ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్లు అప్పట్లో చెప్పిన విషయాలన్నీ జీవితంలో ఎప్పుడో ఒకసారి ఎదురవుతూనే ఉంటాయి. అప్పుడు వెంటనే గుర్తు చేసుకుంటుంటాం. రామకృష్ణ పబ్లిక్‌ స్కూల్‌లో పదో తరగతి చదివేటప్పుడు సోషల్‌ మాస్టర్‌గా రామినాయుడు ఉండేవారు. ఆయన పాఠాలు చెప్పే విధానం, హావభావాలు నాపై చాలా ప్రభావం చూపించాయి. నా భావ వ్యక్తీకరణ స్పష్టంగా ఉండటానికి కారణం ఆయనేని నమ్ముతా. పాఠం చెప్పేటప్పుడు ఆయన ఎంత ఆత్మవిశ్వాసంతో కనిపించేవారో, నేను దర్శకుడిగా కథ చెప్పేటప్పుడు అదే ఆత్మవిశ్వాసంతో ఉంటాను. అలాగే నరసింహమూర్తి అని లెక్కలు చెప్పిన మాస్టర్‌ ప్రభావం నాపై ఎక్కువే. వాళ్లు పాఠాలు చెప్పి వెళ్లిపోతారు. వాళ్లు నేర్పిన విలువలు, సందర్భాల్ని ఎదుర్కోగలిగే శక్తి సామర్థ్యాలు అలా జీవితాంతం ఉండిపోతాయి. ఇక సినిమా రంగంలో కె.విశ్వనాథ్‌ దగ్గర్నుంచి మణిరత్నం, రామ్‌గోపాల్‌ వర్మ వరకు ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మంది గురువులు ఉన్నారు నాకు. చిన్నప్పుడు స్కూల్‌లో పాఠాలు విని ఎలా ప్రయోజకులు అవుతామో, వీళ్ల సినిమాలు చూస్తూ అలా నేర్చుకుంటున్నట్టు భావిస్తా. నేను పరశురామ్‌ దగ్గర పనిచేశా. ఆయన నాకు గురువు. నేను విద్యార్థిగా, ఉపాధ్యాయుడిగానూ జీవితాన్ని చూశా. ఎమ్మెస్సీ బీఈడీ చదివాన్నేను. భాష్యం స్కూల్స్‌లో రెండేళ్లు పాఠాలు చెప్పా. ఉపాధ్యాయుడు ఎప్పుడూ జ్ఞానంతోపాటు, ఆత్మవిశ్వాసాన్నీ నూరిపోస్తాడు. మా గురువులు చాలా మంది నా ఫోన్‌ నెంబర్‌ ఎక్కడెక్కడో కనుక్కుని నాకు సందేశాలు పంపుతుంటారు. తెలియని నంబర్‌ కదా అని తీరిగ్గా చూసుకుంటే.. అప్పుడు మేం ఫలానా మాస్టర్‌ అని చెప్పగానే, చాలా భావోద్వేగానికి గురవుతుంటా. వెంటనే ఫోన్‌ చేసి మాట్లాడతా. ఇంత పెద్దోడు అయిపోయాడు, ఎలా మాట్లాడతాడో అని వాళ్లు బెరుగ్గానే మాటలు కలుపుతారు. 'మీ దెబ్బలు తిని చాలా రోజులైంది సర్‌' అనేసరికి వాళ్లు ఆ వయసులో ఎలా మాట్లాడారో అలా మాట్లాడుతుంటారు. నా శిష్యులు ప్రతి సినిమా తర్వాత వచ్చి బొకేలు ఇస్తుంటారు. 7 నుంచి 9వతరగతి వరకూ బోటనీ చెప్పేవాణ్ని. స్నేహితులు, టీచర్లు, విద్యార్థులు నా మనసులో నుంచి ఎప్పుడూ దూరం కారు. వాళ్లు కలిస్తే నాకు టైమ్‌ ట్రావెలింగ్‌లా ఉంటుంది. ఆ రోజుల్లోకి వెళ్లి వస్తుంటాను."

Shiva Nirvana
శివ నిర్వాణ

ఇదీ చూడండి: Cinema News: 'రాజా విక్రమార్క' టీజర్.. 'గల్లీరౌడీ' రిలీజ్ డేట్

Last Updated : Sep 5, 2021, 8:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.