'దంగల్' చిత్రంలో ఆమిర్‌ఖాన్ కుమార్తెగా నటించి అలరించిన కథానాయిక ఫాతిమా సనా షేక్. తెలుగులో 'నువ్వు నేను ఒక్కటవుదాం' అనే చిత్రంలోనూ నటించింది. ప్రస్తుతం హిందీలో తెరకెక్కుతున్న 'అరువి' అనే తమిళ రీమేక్‌లో నటించేందుకు ఆమె సిద్ధమయ్యారు.
బాలీవుడ్లో రీమేక్ అవుతున్న ఈ చిత్రానికి ఇ.నివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫెయిత్ ఫిల్మ్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వి.కి. రజనీ నిర్మాత. అయితే సినిమా పేరును ఇంకా ఖరారు చేయలేదు. ఈ ఏడాది మధ్యలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
![Fatima Sana Shaikh to headline Hindi remake of Tamil hit Aruvi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10879495_p.jpg)
ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు ట్విటర్ వేదికగా ఫాతిమాతో కలిసి దిగిన గ్రూఫ్ ఫొటోను షేర్ చేశారు. దర్శకుడు ఇ.నివాస్ గతంలో రామ్ గోపాల్‌వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. హిందీలోనూ కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఫాతిమా గతేడాది అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కిన 'లుడో' చిత్రంలో పింకీ జైన్‌గా నటించి మెప్పించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: 'పాప ఓ పాప' వచ్చేసింది- 'మిషన్ మజ్ను' షూటింగ్లో రష్మిక