ETV Bharat / sitara

50 మిలియన్ వ్యూస్​తో 'అఖండ' గర్జన - 50 మిలియన్ వ్యూస్​తో 'అఖండ' గర్జన

బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తోన్న చిత్రం 'అఖండ'. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ రోర్ విడుదల చేసింది చిత్రబృందం. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్​లో 50 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి దూసుకెళ్తోంది.

Akhanda
అఖండ
author img

By

Published : Apr 29, 2021, 7:55 PM IST

బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'అఖండ'. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ మూవీ టైటిల్‌ రోర్ యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో దూసుకెళ్తోంది. ఇప్పటివరకు 50 మిలియన్‌ వ్యూస్‌ని దాటినట్లు చిత్ర నిర్మాణ సంస్థ తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. "కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది.. కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది" అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్‌ ఆయన అభిమానులతో పాటు సినీ జనాలను ఆకట్టుకుంటోంది.

బాలకృష్ణ - బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో వస్తోన్న హ్యాట్రిక్ మూవీ ఇది. దీంతో చిత్రసీమలో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో ప్రగ్యా జైస్వాల్‌ కథానాయికగా నటిస్తుండగా శ్రీకాంత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తుండగా రామ్‌ప్రసాద్ ఛాయాగ్రాహకుడిగా పనిచేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.