Radhe shyam pre release event: 'రాధేశ్యామ్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అంతా సిద్ధమైంది. ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీలో ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ ఈవెంట్‌కు నవీన్ పోలిశెట్టి యాంకరింగ్ చేస్తాడని నిర్మాణ సంస్థ వెల్లడించింది.
ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్గా నటించింది. కృష్ణంరాజు కీలకపాత్ర పోషిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందిస్తున్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 14న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Sonusood movie: సోనూసూద్ హీరోగా కొత్త సినిమాను ప్రకటించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'ఫతే' టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ విషయాని చెప్పడం సహా పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
'బాజీరావ్ మస్తానీ', 'షంసేరా' సినిమాలకు అసిస్టెంట్‌గా చేసిన అభినందన్ గుప్తా.. 'ఫతే' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిజజీవిత సంఘటనలో ఆధారంగా తీస్తున్న ఈ సినిమాలో ఫుల్‌గా యాక్షన్ సీన్స్ ఉండనున్నాయి. ఫిబ్రవరిలో షూటింగ్ మొదలుకానుంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
Bangarraju Movie: 'బంగార్రాజు' సినిమా షూటింగ్ గురించి హీరో నాగార్జున ట్వీట్ చేశారు. చివరి రోజు చిత్రీకరణలో ఉన్నామని, మరో స్పెషల్ సాంగ్ సిద్ధమవుతుందని రాసుకొచ్చారు. పండగలాంటి సినిమా 'బంగార్రాజు' అని అన్నారు.
'సోగ్గాడే చిన్న నాయన' సినిమాకు ప్రీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున, రమ్యకృష్ణతో పాటు నాగచైతన్య, కృతిశెట్టి కూడా ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు. కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 15న ఈ సినిమా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.
Nani shyam singha roy movie: నాని 'శ్యామ్‌సింగరాయ్' సినిమా.. శుక్రవారం థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మూవీ మేకింగ్ వీడియో విడుదల చేశారు. ఇందులో చిత్రబృందం పడిన కష్టం కనిపిస్తుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
నాని ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతమందించారు. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వం వహించారు.
ఇవీ చదవండి:
- 'బంగార్రాజు' వెనక్కి తగ్గుతాడా?.. రిలీజ్‌పై టెన్షన్
- ఫ్యాన్స్ చేతుల మీదుగా 'రాధేశ్యామ్' ట్రైలర్ లాంచ్
- 'రాధేశ్యామ్'లో చాలా సర్ప్రైజ్లు: డైరెక్టర్ రాధాకృష్ణ
- డబుల్ బొనాంజ.. ఈ కాంబో కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!
- 'శ్యామ్‌సింగరాయ్'తో అది సాధ్యమైంది: నాని
- ఇకపై రీమేక్‌లు అస్సలు చేయను: నాని
- టికెట్ రేట్లపై ఆ నిర్ణయం.. ప్రేక్షకుల్ని అవమానించడమే: హీరో నాని
- కృతిశెట్టితో రొమాన్స్ గురించి హీరో నాని మాటల్లో..