బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ బుధవారం ట్విట్టర్లో తన అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా తన కొత్త చిత్రం 'పఠాన్' ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుందని పలువురు ఫ్యాన్స్ అడగ్గా.. విడుదలకు సిద్ధమైన చిత్రాలన్నీ అయిపోయిన తర్వాత తన సినిమా రిలీజ్ అవుతుందని చమత్కరించారు.
షారుక్ చివరిగా నటించిన చిత్రం 'జీరో'. ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 2018లో విడుదలై బాక్సాఫీసు వద్ద అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో మూడేళ్లు తర్వాత 'పఠాన్' చిత్రంలో నటించేందుకు అంగీకరించారు.
-
Have 15 minutes before I go into doing more of nothing! Thought will spend it with you all and do a quick #AskSRK 3...2....1....go!
— Shah Rukh Khan (@iamsrk) March 31, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Have 15 minutes before I go into doing more of nothing! Thought will spend it with you all and do a quick #AskSRK 3...2....1....go!
— Shah Rukh Khan (@iamsrk) March 31, 2021Have 15 minutes before I go into doing more of nothing! Thought will spend it with you all and do a quick #AskSRK 3...2....1....go!
— Shah Rukh Khan (@iamsrk) March 31, 2021
అయితే బుధవారం అభిమానులతో ట్విట్టర్ ద్వారా ముచ్చటించిన షారుక్.. వారు అడిగిన ప్రశ్నలకు తీరిగ్గా సమాధానమిచ్చారు. తాను నటించే కొత్త సినిమాలతో పాటు పుట్టినరోజు ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు.
మీరు నటిస్తున్న కొత్త చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఎప్పుడు వస్తుంది?
షారుక్: ఇప్పటికే అనేక సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మన చిత్రం విడుదల చేయాల్సిన సమయం వస్తుంది. కంగారు పడకండి.
గతేడాది యాష్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించే సినిమాను ప్రారంభించారు. దీనిపై అభిమానులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదేం?
షారుక్: అనౌన్స్మెంట్స్ అనేవి ఎయిర్‌పోర్ట్స్‌లో.. రైల్వే స్టేషన్లలో ఉంటాయి మై ఫ్రెండ్. సినిమాలకు అలా కాదు.. అలాంటి ఊహాగానాలతోనే సినిమాకు ప్రచారం లభిస్తుంది.
పఠాన్‌లో సల్మాన్‌ఖాన్‌తో కలిసి నటించడం ఎలా అనిపించింది?
షారుక్: సోదరుడు ఎప్పుడూ సోదరుడే!
'జబ్ హ్యారీ మెట్ సేజల్' సినిమాకు సీక్వెల్ ఎప్పుడు వస్తుంది?
షారుక్: హా..హా.. బాక్సాఫీసు వద్ద ఫెయిల్యూర్‌గా నిలిచిన సినిమాలను సీక్వెల్ చేయమని అందరూ అడుగుతారేంటి?
మూడేళ్ల తర్వాత తెరపై కనిపించనున్నారు. దీనిపై మీ స్పందన?
షారుక్: అవును.. చాలా సమయం పట్టింది. త్వరగా త్వరగా షూటింగ్ పూర్తి చేసుకొని మీ ముందుకొస్తాం. కంగారు పడకండి.
ఇదీ చూడండి: డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్ట్