ETV Bharat / sitara

విక్కీ-కత్రినా పెళ్లిపై కొత్త అప్డేట్​.. ఫ్యాన్స్​కు నిరాశే! - బాలీవుడ్ న్యూస్

Vicky Katrina Wedding: బాలీవుడ్​ స్టార్ ​కపుల్​ విక్కీ కౌశల్-​ కత్రినా కైఫ్​ వివాహం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్​కు కాస్త నిరాశే మిగిలింది. పెళ్లి చూడలేకపోయినా ఫొటోలు వస్తే చూసి మురిసిపోదాం అనుకుంటే.. అవేవీ ఇప్పట్లో బయటకు వచ్చేలా లేవంటున్నాయి బాలీవుడ్​ వర్గాలు.

katrina
విక్కీ కౌశల్-కత్రినా
author img

By

Published : Dec 3, 2021, 4:33 PM IST

Vicky Katrina Wedding: గత కొంతకాలంగా ప్రేమాయణం సాగిస్తున్న బాలీవుడ్​ స్టార్స్​ విక్కీ కౌశల్​-కత్రినా కైఫ్​ ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటికానున్నారు. రాజస్థాన్ జైపుర్​లోని సిక్స్​ సెన్సెస్​ ఫోర్ట్​లో ఈనెల 9న వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ స్టార్​ కపుల్​ పెళ్లిని చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఫ్యాన్స్​కు నేరుగా వారి వివాహాన్ని చూసే అవకాశం లేదు. కేవలం బాలీవుడ్​ సహా పలువురు ప్రముఖుల సమక్షంలో ఈ పెళ్లి వేడుకలు జరగనున్నాయి.

ఇలా వీలైనంత గోప్యంగా పెళ్లి వేడుకలు జరగడం బాలీవుడ్​కు కొత్తేం కాదు. స్టార్​ కపుల్స్​ దీపికా పదుకొణె-రణ్​వీర్​ సింగ్​, విరాట్​ కోహ్లీ-అనుష్క శర్మ వివాహం ఇదే తరహాలో జరిగింది. పెళ్లికి ఒక నెల ముందు వరకు దీపికా-రణ్​వీర్​ జంట వారి పెళ్లి గురించి వెల్లడించలేదు. మరోవైపు కోహ్లీ-అనుష్క కూడా రహస్యంగా పెళ్లి చేసుకుని.. సోషల్​ మీడియాలో ఆ ఫొటోలు పోస్ట్ చేశారు.

ఇప్పుడు ఇదే స్టైల్​ను విక్కీ-కత్రినా జంట ఫాలో అవుతోంది. దీంతో ఫ్యాన్స్..​ విక్కీ-క్యాట్​ పెళ్లి ఫొటోలు చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆ ఫొటోలు కూడా ఇప్పుడప్పుడే వచ్చే అవకాశం లేవంటున్నాయి బాలీవుడ్​ వర్గాలు. ఎందుకంటే వారి పెళ్లి ఫొటోలను ప్రచురించే హక్కులను ఓ అంతర్జాతీయ మ్యాగజైన్​ కొనుగోలు చేసుకుందట. కాబట్టి ఈ ప్రేమజంట పెళ్లి ఫొటోల కోసం అభిమానులు ఇంకొంతకాలం ఆగాల్సిందే.

ఇదీ చూడండి : ఓటీటీలో ఈ రోజే ఇన్ని సినిమాలు రిలీజ్.. మీరేం చూస్తున్నారు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.