ETV Bharat / sitara

'సూర్య సినిమాలు ఆపేసి.. రాజకీయాల్లోకి రావాలి' - సూర్య సినిమాలు ఆపేయాలి

కోలీవుడ్​ స్టార్​ సూర్య సినిమాలు చేయడం మానేసి రాజకీయ ప్రవేశం చేయాలని కోరారు ఆయన అభిమానులు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్టర్లు నెట్టింట్లో వైరల్​గా మారాయి.

surya
సూర్య
author img

By

Published : Sep 6, 2020, 7:54 PM IST

తమిళ స్టార్ హీరో సూర్య సినీ ప్రస్థానం ప్రారంభించి ఆగస్టు 5వ తేదీకి 23ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అభిమానులు ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే సోషల్​మీడియాలో సూర్యకు సంబంధించిన ఓ ఫొటో ట్రెండింగ్​గా మారింది.

ఏ హీరో అభిమానులైనా తమ హీరో మరిన్ని సినిమాలు చేయాలని ఆకాంక్షిస్తారు. కానీ 'సినిమాల్లో నటించడం మానేసి రాజకీయాల్లోకి రావాలంటూ సూర్యకు పిలుపునిచ్చారు ఆయన ఫ్యాన్స్. దీనికి సంబంధించి భారీ ఎత్తున ఫ్లెక్సీ కట్టారు. ఇందులో విప్లవ నాయకుడు చెగువేరా రూపంలో సూర్య ఫొటోలు పొందుపరిచి పక్కనే తమిళనాడు సచివాలయం ఫొటోను ముద్రించారు. ఈ పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

surya
సూర్య

త్వరలోనే అమెజాన్​ ప్రైమ్​లో విడుదల కానున్న 'ఆకాశమే హద్దురా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు సూర్య. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్​ బాబు కీలకపాత్రలో కనిపించనున్నారు.

ఇదీ చూడండి 'ప్రేమించడం నేరమైతే.. రియా అరెస్టుకు సిద్ధం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.