ETV Bharat / sitara

'పుష్ప' విలన్​గా మలయాళ నటుడు - పుప్ప విలన్​గా ఫహాద్​ ఫాజిల్

అల్లుఅర్జున్​ కొత్త చిత్రం 'పుష్ప' సినిమాలో ప్రతినాయక పాత్రపై క్లారిటీ వచ్చేసింది. మలయాళ నటుడు ఫహాద్​ ఫాజిల్​ ఇందులో విలన్​గా నటిస్తున్నారని చిత్రబృందం ప్రకటించింది.

fahadh faasil confirmed as Villain for Allu Arjun's pushpa
'పుష్ప' విలన్​గా మలయాళ నటుడు
author img

By

Published : Mar 21, 2021, 10:09 AM IST

స్టైలిష్​స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప' చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర ఎవరు పోషిస్తున్నారనే దానిపై క్లారిటీ వచ్చేసింది. మలయాళ నటుడు ఫహాద్​ ఫాజిల్​ ఇందులో విలన్​గా కనిపించనున్నారని ఆదివారం చిత్రబృందం ప్రకటించింది. ఆయన తెలుగులో నటిస్తోన్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం.

ఈ సినిమాలో పుష్పరాజ్‌ పాత్ర పోషిస్తున్నారు బన్నీ. పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది రష్మిక. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే కథ ఇది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. 'ఆర్య', 'ఆర్య 2' తర్వాత బన్నీ- సుకుమార్‌ మరోసారి కలిసి చేస్తుండటం వల్ల ఈ సినిమాపై ఆసక్తి పెరుగుతోంది.

ఇదీ చూడండి: కీర్తి సురేశ్​ మిస్సింగ్​పై నితిన్​ ట్వీట్​.. హైదరాబాద్​ పోలీస్​ రిప్లై!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.