విశాల్-ఆర్య ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'ఎనిమీ'. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించారు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ మూవీ టీజర్‌గా తాజాగా విడుదల చేశారు. సెప్టెంబర్‌లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మెహరీన్ హీరోహీరోయిన్లుగా ఓ చిత్రం రూపొందుతోంది. ఇటీవలే ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించారు. 'మంచిరోజులు వచ్చాయి' అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా పాత్రలను పరిచయం చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ హీరోగా 'చోర్‌బజార్' టైటిల్‌తో ఓ చిత్రం తెరకెక్కుతోంది. 'జార్జ్‌రెడ్డి' ఫేమ్ జీవన్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది చిత్రబృందం. ఆదివారం ఉదయం 9.45 నిమిషాలకు దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేయనున్నారు.
కమల్‌హాసన్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో విక్రమ్ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతితో పాటు ఫహాద్ ఫాజిల్ కీలకపాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ సెట్లో కమల్‌తో దిగిన ఫొటోను నెట్టింట షేర్ చేశారు ఫహాద్. ఇద్దరూ అద్భుత నటులతో కూడిన ఈ చిత్రం వైరల్‌గా మారింది.