ETV Bharat / sitara

'ఎఫ్ 3' కొత్త రిలీజ్ డేట్.. 'బడవ రాస్కెల్' కోసం ఆర్జీవీ - Badava rascal movie RGV

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో ఎఫ్ 3, బడవ రాస్కెల్​ ప్రీ రిలీజ్ ఈవెంట్, డాక్టర్ స్ట్రేంజ్ ఇన్​ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్​నెస్ చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

F3 movie RGV
మూవీ న్యూస్
author img

By

Published : Feb 14, 2022, 10:18 AM IST

Updated : Feb 14, 2022, 12:02 PM IST

F3 movie: 'ఎఫ్ 3' సినిమా కొత్త రిలీజ్​ తేదీ ఖరారు చేశారు. ఏప్రిల్ 28న కాకుండా మే 27న చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. కొత్త పోస్టర్​ కూడా విడుదల చేశారు.

F3 movie new release date
ఎఫ్ 3 మూవీ కొత్త రిలీజ్ డేట్

'ఎఫ్ 2' చిత్రానికి సీక్వెల్​గా వస్తున్న ఈ సినిమాను డబ్బు నేపథ్య కథతో హాస్యభరితంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో వెంకీ-వరుణ్​తో పాటు సునీల్ కీలకపాత్ర పోషించారు. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా చేస్తుండగా సోనాల్ చౌహాన్ కీలకపాత్రలో కనిపించనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. దిల్​రాజు నిర్మించారు.

Badava rascal movie RGV: 'పుష్ప'లో జాలీరెడ్డిగా ఆకట్టుకున్న ధనంజయ్.. హీరోగా నటించిన కన్నడ చిత్రం 'బడవ రాస్కెల్'. తెలుగులో ఈ పేరుతోనే ఫిబ్రవరి 18న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్.. 15వ తేదీన హైదరాబాద్​లో జరగనుంది.

badava rascal pre release event RGV
బడవ రాస్కెల్ ప్రీ రిలీజ్ ఈవెంట్

దీనికి ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శక-నిర్మాత రామ్​గోపాల్ వర్మ హాజరు కానున్నారు. ఈ సినిమాకు శంకర్ గురు దర్శకత్వం వహించారు.

Doctor strange in the multiverse trailer: మార్వెల్ స్టూడియోస్​ నుంచి మరో క్రేజీ సినిమా రిలీజ్​కు రెడీ అయిపోయింది. 'డాక్టర్​ స్ట్రేంజ్​ ఇన్​ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్​నెస్​' పేరుతో తెరకెక్కిన ఈ సినిమా మే 6న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో థియేటర్లలోకి రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ సినిమా డాక్టర్ స్ట్రేంజ్​తో పాటు వాండా చేసిన సాహసాలు, అభిమానుల్ని మైమరపిస్తున్నాయి. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అనే ఆత్రుత కలిగిస్తున్నాయి. ఈ చిత్రానికి సామ్ రైమీ- బెనెడిక్ట్ కుంబర్​బ్యాచ్​ దర్శకత్వం వహించారు.

.
.
.
.

ఇవీ చదవండి:

Last Updated : Feb 14, 2022, 12:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.