ETV Bharat / sitara

అతిథి పాత్రలకు సై అంటోన్న స్టార్ హీరోలు! - గంగూబాయ్ కతియావాడిలో అజయ్ దేవ్​గణ్

వేరే హీరోల సినిమాల్లో అతిథి పాత్రల్లో మెరిసిన అగ్రనటులు చాలామందే ఉన్నారు. సహ నటులు, దర్శకులతో ఉన్న స్నేహంతోనో, సినిమాకు కలెక్షన్లు రావాలనో ఇలా చేస్తుంటారు. తాజాగా 2021లోనూ కొందరు స్టార్ హీరోలు గెస్ట్ అప్పియరెన్స్​తో మెప్పించనున్నారు. వారెవరో చూద్దాం.

Expected cameos in 2021's Bollywood films that fans are waiting for
అతిథి పాత్రలకు ఓకే అంటోన్న స్టార్ హీరోలు!
author img

By

Published : Feb 16, 2021, 12:29 PM IST

స్టార్ హీరోల నుంచి సినిమాలు ఎప్పుడు వస్తాయా? అని ఎదురుచూస్తూ ఉంటారు అభిమానులు. వారి నుంచి ఏడాదికి ఒక్క సినిమా వచ్చినా సంతోషంతో థియేటర్ల వద్ద టికెట్ల కోసం బారులుతీరతారు. అయితే అలాంటి స్టార్స్ వేరే హీరోల చిత్రాల్లో అతిథి పాత్రల చేస్తే ఎలా ఉంటుంది? సహ నటులు, దర్శకులతో స్నేహంతో ఇలా గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చిన నటులు చాలా మందే ఉన్నారు. ఈ ఏడాది కూడా బాలీవుడ్​ అగ్రనటులు వేరే హీరోల సినిమాల్లో నటించేందుకు సై అంటున్నారు. వారెవరో చూద్దాం.

షారుక్ 'పఠాన్​'లో సల్మాన్

యశ్​రాజ్ ఫిలింస్​ తెరకెక్కిస్తోన్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'పఠాన్'. చాలా కాలం తర్వాత కింగ్ ఖాన్ ముఖానికి రంగేసుకున్న సినిమా ఇది. దీపికా పదుకొణె హీరోయిన్. ఈ మూవీ పట్ల ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. మరి షారుక్​ లాంటి నటుడికి మరో అగ్రనటుడు తోడైతే? ఇప్పుడు అదే నిజం కాబోతుంది. ఈ చిత్రంలో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో మెరవనున్నారు.

Expected cameos in 2021's Bollywood films that fans are waiting for
షారుక్, సల్మాన్

రణ్​బీర్ 'బ్రహ్మాస్త్ర'లో షారుక్

'పఠాన్' తర్వాత తన తర్వాతి చిత్రం గురించి షారుక్ ప్రకటించకపోయినా పలు సినిమాల్లో ఆయన అతిథి పాత్రలు చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'బ్రహ్మాస్త్ర'లో కింగ్ ఖాన్ గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వనున్నారని బాలీవుడ్ ప్రముఖ మీడియా వెల్లడించింది. ఈ చిత్రంలో రణ్​బీర్ కపూర్, ఆలియా భట్, నాగార్జున, అమితాబ్ బచ్చన్, మౌనీ రాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

రణ్​బీర్, షారుక్

మాధవన్ 'రాకెట్రీ'లో షారుక్

ప్రముఖ నటుడు మాధవన్ హీరోగా రూపొందుతోన్న చిత్రం 'రాకెట్రీ: ద నంబీ ఎఫెక్ట్'. ఇందులో షారుక్ ఖాన్ అతిథి పాత్ర చేయనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో కింగ్ ఖాన్ ఓ జర్నలిస్ట్ పాత్రలో మెరవనున్నారట. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలు వెలువడనున్నాయి.

రాకెట్రీలో మాధవన్

ఆలియా చిత్రంలో అజయ్ దేవ్​గణ్

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆలియా భట్ హీరోయిన్​గా తెరకెక్కుతోన్న చిత్రం 'గంగూబాయ్ కతియావాడి'. ఇందులో అజయ్ దేవ్​గణ్ గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వనున్నారట. ఇంతకుముందు భన్సాలీతో 'హమ్ దిల్ దే చుకే సనమ్' చిత్రం చేశారు అజయ్.

ఆలియా, అజయ్

'హంగామా 2'లో అక్షయ్ ఖన్నా

ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కిస్తోన్న కామెడీ చిత్రం 'హంగామా 2'. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా అతిథి పాత్ర చేయనున్నారు. ఇందులో మీజాన్ జెఫ్రీ, ప్రణీత సుభాష్, శిల్పా శెట్టి, పరేశ్ రావల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 2003లో విడుదలైన 'హంగామా'లో లీడ్ రోల్ పోషించారు అక్షయ్.

హంగామా 2లో అక్షయ్ ఖన్నా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.