ETV Bharat / sitara

కేంద్రం 'హౌస్​​ఫుల్'​ నిర్ణయంపై నిర్మాతలు హర్షం - PVR CEO tweet

సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల్లో సీట్ల సామర్థ్యాన్ని నూరు శాతానికి పెంచేందుకు కేంద్రం అనుమతులివ్వడంపై పలువురు నిర్మాతలు, సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ట్విటర్​ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.

Exhibitors and Producers Guild welcome govt's decision
కేంద్రం నిర్ణయంపై నిర్మాతలు హర్షం
author img

By

Published : Jan 31, 2021, 4:36 PM IST

Updated : Jan 31, 2021, 4:42 PM IST

ఫిబ్రవరి 1 నుంచి థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతినిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేయడంపై సినీ ప్రముఖులు, నిర్మాతలు హర్షం వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో కలిగిన నష్టాల నుంచి కోలుకునేందుకు మార్గం దొరికిందని అన్నారు. కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్​ జావడేకర్ సినిమా థియేటర్లకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను ఆదివారం విడుదల చేశారు.

సినీ ఇండస్ట్రీకి ఊరట లభించడంపై ప్రొడ్యూసర్స్ గిల్డ్​ ఆఫ్​ ఇండియా అధ్యక్షుడు, నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్​ ట్విటర్​ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతించడం మంచి విషయమని అన్నారు. కేంద్ర మంత్రి ప్రకాశ్​ జావడేకర్​కు కృతజ్ఞతలు తెలిపారు.

  • We welcome the decision of @MIB_India to allow 100% capacity in cinemas from February 1 and extend our sincere gratitude to Honourable @PrakashJavdekar ji and everyone involved in facilitating this important step in our industry’s recovery

    — Producers Guild of India (@producers_guild) January 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కేంద్రం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసింది మల్టీప్లెక్స్ అసోసియేషన్​ ఆఫ్ ఇండియా. ఈ మేరకు నటుడు, భాజపా ఎంపీ సన్నీ దేఓల్​కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

  • We are deeply grateful to Hon. Minister @PrakashJavdekar & @MIB_India for allowing 100% seating capacity in Cinemas from 1 Feb. We would like to extend our gratitude to Hon. MP @iamsunnydeol for his leadership and support🙏🙏

    — Multiplex Association Of India (@MAofIndia) January 31, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పీవీఆర్​ లిమిటెడ్ సీఈఓ గౌతమ్ దత్త, ఐనాక్స్ ఛీఫ్​ ఎగ్జిక్యూటివ్​ ఆఫీసర్ అలోక్​ టాండన్​... కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. ట్వీట్లు చేశారు.

ఇదీ చదవండి:బాలయ్య నయా లుక్​.. 'బీబీ3' రిలీజ్​ డేట్​ ఫిక్స్​​

Last Updated : Jan 31, 2021, 4:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.