ETV Bharat / sitara

నన్ను ఆడపిల్ల అనుకొని పొరబడేవారు: ది రాక్​ - ది రాక్​ ను అమ్మాయి అనుకునేవారు

చిన్నప్పుడు తనను ఆడపిల్ల అనుకొని పొరబడేవారని గతాన్ని గుర్తుచేసుకున్నాడు హాలీవుడ్‌ స్టార్​ నటుడు డ్వేన్​ జాన్సన్. తాను ఎంతో మృదుస్వభావం కలిగి ఉండటం సహా జుట్టు కూడా అమ్మాయి జుట్టులా ఎంతో మెత్తగా ఉండటమే ఇందుకు కారణమని చెప్పాడు.

the rock
దిరాక్​
author img

By

Published : May 5, 2021, 5:32 AM IST

డ్వేన్‌ జాన్సన్‌ (ది రాక్‌) కండలు తిరిగిన దేహంతో ఉండే హాలీవుడ్‌ నటుడు.. గతంలో రెజ్లర్‌ అనే విషయం చాలామందికి తెలుసు. అయితే.. రాక్‌ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు అనే విషయం చాలామందికి తెలియదు. ప్రస్తుతం శారీరకంగా ఎంతో దృఢంగా కనిపిస్తున్న రాక్‌ పాఠశాలకు వెళ్లే రోజుల్లో చాలా మృదువుగా ఉండేవాడట. అందుకే చాలా మంది అతడిని ఆటపట్టించేవారట. తనను ఆడపిల్ల అనుకొని పొరబడేవారని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు రాక్.

the rock
దిరాక్​

చిన్నతనంలో ఒకసారి పాఠశాల బస్సులో ఎక్కి ఒక అబ్బాయి పక్కనే కూర్చోగా.. వెంటనే ఆ అబ్బాయి.. 'నేను నిన్ను ఒకటి అడగొచ్చా..?’ అన్నాడట. దానికి అడగండి అని రాక్‌ స్పందించగా.. 'నువ్వు అమ్మాయివా..? అబ్బాయివా..?' అని అనుమానం వ్యక్తం చేశాడట. అయితే.. 7 నుంచి 11 ఏళ్ల వయసు మధ్యకాలంలో తాను ఎంతో మృదుస్వభావం కలిగి ఉండటం సహా తన జుట్టు కూడా అమ్మాయి జుట్టులా ఎంతో మెత్తగా ఉండటమే ఇందుకు కారణమని రాక్ ఇంటర్వ్యూలో తెలిపాడు. తన తండ్రి రెజ్లర్‌ కావడం వల్ల చిన్నతనంలో తరచూ పాఠశాలలు మారుతూ రావాల్సి వచ్చేదట. అలా దాదాపు 13 పాఠశాలలు మారినట్లు రాక్‌ గుర్తు చేసుకున్నాడు.

ప్రస్తుతం డ్వేన్ జాన్సన్ విలన్‌గా నటించిన 'బ్లాక్ ఆడమ్‌' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి రాక్‌ నిర్మాతగానూ వ్యవహరించాడు. వీటితో పాటు 'జంగిల్‌ క్రూజ్‌', 'రెడ్‌ నోటీస్‌' చిత్రాల్లోనూ రాక్‌ నటిస్తున్నాడు. అవి కూడా చిత్రీకరణ చివరి దశలో ఉన్నాయి.

ఇదీ చూడండి: తన ఇంటి ద్వారాలనే విరగ్గొట్టిన 'ది రాక్'​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.