ETV Bharat / sitara

టిక్కెట్‌ ధరల తగ్గింపుపై 'ఆర్‌ఆర్‌ఆర్‌' అసంతృప్తి

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్‌ ధరల తగ్గింపు వ్యవహారంపై 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR movie) నిర్మాత డీవీవీ దానయ్య (DVV Danayya production house) స్పందించారు. ఈ ధరల తగ్గింపు ప్రక్రియ తమ చిత్రంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు.

rrr
ఆర్​ఆర్​ఆర్​
author img

By

Published : Nov 14, 2021, 11:27 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్‌ ధరల తగ్గింపు వ్యవహారంపై 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR movie) నిర్మాత డీవీవీ దానయ్య (DVV Danayya production house) అసంతృప్తి వ్యక్తం చేశారు. ధరల తగ్గింపు ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని.. దీంతో ఆ చిత్ర బృందం త్వరలో కోర్టు మెట్లు ఎక్కనుందంటూ గత కొన్ని రోజుల నుంచి వరుస కథనాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ వార్తలపై తాజాగా డీవీవీ దానయ్య స్పందించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

"ఏపీలో సినిమా టిక్కెట్‌ ధరలు తగ్గించడం మా సినిమాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే, ఈ విషయంపై న్యాయం కోరుతూ మేము లేదా 'ఆర్‌ఆర్‌ఆర్‌' టీమ్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం లేదు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి మా పరిస్థితిని తెలియజేసి సరైన పరిష్కారం కోరుతాం" అని దానయ్య ట్వీట్‌ చేశారు.

దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli RRR movie) తెరకెక్కించిన యాక్షన్‌, ఎమోషనల్‌ డ్రామా 'ఆర్‌ఆర్‌ఆర్‌'. రామ్‌చరణ్‌-తారక్‌ (ntr ram charan rrr movie) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోన్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. ఆలియాభట్‌ (RRR heroine), ఒలీవియా మోరీస్‌ కథానాయికలు. శ్రియ, సముద్రఖని, అజయ్‌ దేవ్‌గణ్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

ఇదీ చూడండి: 'ఆర్‌ఆర్‌ఆర్‌' మాస్ సాంగ్‌.. 'నాటు' స్టెప్పులు నేర్చుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.