ETV Bharat / sitara

దుబాయ్​ షేక్​ నోట ఎస్పీ బాలు పాట.. వైరల్​

author img

By

Published : Sep 9, 2021, 6:31 AM IST

Updated : Sep 9, 2021, 8:00 AM IST

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(sp balasubramanyam songs) ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు. తాజాగా దుబాయ్​కు చెందిన ఓ షేక్​ ఆయన పాడిన ఓ గీతాన్ని అలవోకగా ఆలపించి ఆశ్చర్యానికి గురి చేశారు. వైరల్​గా మారిన ఆ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

sp balu
ఎస్పీ బాలు

లెజండరీ సింగర్‌, గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(sp balasubramanyam songs) పాట అంటే ఇష్టపడని వారుండరు. ఆయన పాటకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. కొన్నివేల పాటలు ఆలపించిన బాలు అనారోగ్యంతో గతేడాది కన్నుమూసినప్పటికీ.. పాట రూపంలో ఆయన ఇంకా మన మధ్యే జీవించి ఉన్నారు. అందుకు నిదర్శనమే ఈ వీడియో. ఎస్పీబీ ఆలపించిన పాటల్లో ఒక మధురమైన పాటను ఓ దుబాయ్‌ షేక్‌ అలవోకగా ఆలపించి.. అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు.

కె.విశ్వనాథ్‌ తెరకెక్కించిన సంగీత ప్రధాన దృశ్యకావ్యం 'సిరివెన్నెల'. కె.వి.మహదేవన్‌ సంగీతం అందించిన ఈ సినిమాలోని ప్రతి పాట ఓ ఆణిముత్యం. ముఖ్యంగా 'విధాత తలపున..'(vidhata talapuna song singer) అంటూ సాగే పాటను తన గానంతో ఎస్పీబాలు మరోస్థాయికి తీసుకువెళ్లారు. తాజాగా ఇదే పాటను దుబాయ్‌కు చెందిన ఓ షేక్‌ ఆలపించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన టిక్‌టాక్‌లో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. సంగీతంపట్ల ఆయనకు ఉన్న అభిరుచికి తెలుగు సినీ ప్రియులు ఫిదా అవుతున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: ఇంజినీరు అవుతారనుకుంటే సింగర్​ అయ్యారు

Last Updated : Sep 9, 2021, 8:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.