ETV Bharat / sitara

పోలీసులకు సవాలుగా శాండల్​వుడ్ 'డ్రగ్స్ రాకెట్'

author img

By

Published : Sep 6, 2020, 9:31 AM IST

Updated : Sep 6, 2020, 11:43 AM IST

కర్ణాటకలో డ్రగ్ రాకెట్ కుప్పకూలింది. ఇదే కేసుతో సంబంధముందన్న ఆరోపణలతో ఇప్పటికే అరెస్ట్ అయిన నటి రాగిణిని పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ దందాతో ఎవరెవరికీ సంబంధాలున్నాయో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

కర్ణాటకలో కుప్పకూలిన 'డ్రగ్స్ రాకెట్'
నటి రాగిణి ద్వివేది

మాదక ద్రవ్యాల వినియోగం, పంపిణీ చేస్తున్న ఆరోపణలపై అరెస్టయిన నటి రాగిణి ద్వివేది తీవ్ర విచారణ ఎదుర్కొంటున్నారు. పోలీస్‌ అధికారిణి అంజుమాల నేతృత్వంలోని అధికారుల బృందం ఆమెను శనివారం పలు ప్రశ్నలు సంధించింది. వాటికి రాగిణి ఆచి తూచి స్పందిస్తోంది. సరైన రీతిలో బదులివ్వకపోతే న్యాయస్థానం అనుమతితో మరో వారం పాటు విచారించాలని బెంగళూరు కేంద్ర నేర నియంత్రణ విభాగం (సీసీబీ) అధికారులు తీర్మానించారు.

  • యలహంక జ్యుడీషియల్‌ లేఔట్‌లో రాగిణి నివాసంపై దాడి చేసిన సమయంలో గంజాయి నింపిన ఎనిమిది సిగరెట్లను పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. వాటిని ఫోరెన్సిక్‌ ప్రయోగశాలకు పంపించారు. రవిశంకర్‌తో కలిసి ఆమె ఆఫ్రికాకు చెందిన కొందరి నుంచి మాదక ద్రవ్యాలను కొనుగోలు చేసి పార్టీల్లో విక్రయించేవారని ప్రాథమిక విచారణలో గుర్తించారు. కొన్నింటిని కొరియర్‌ ద్వారా, డార్క్‌వెబ్‌ సైట్ల నుంచి తెప్పించుకున్నట్లు అనుమానిస్తున్నారు. హైఫై పార్టీల్లో కొందరు రాజకీయ నాయకులు, కీలక అధికారుల కుటుంబీకులు, సినీ నటులు పాల్గొనేవారని తెలిసింది. మాదకద్రవ్యాలతో సంబంధం ఉన్న 20 మంది పేర్లు తాజాగా వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
  • విచారణ కోసం హోసూరు రోడ్డు డెయిరీ సర్కిల్‌ సమీప మహిళా సాంత్వన కేంద్రంలో ఉన్న రాగిణికి పాస్తా, నీటి సీసా, వస్త్రాలను అందించేందుకు తల్లిదండ్రులు రోహిణి ద్వివేది, రాకేశ్‌ ద్వివేది శుక్రవారం రాత్రి వెళ్లారు. వాటిని రాగిణికి అందించేందుకు అవకాశం ఇవ్వకపోవడం వల్ల వెనుదిరిగారు. నా కుమార్తెను కేసుల్లో ఇరికించేందుకు కుట్ర పన్నుతున్నారని రోహిణి ఆరోపించారు. వీఐపీ సదుపాయాలేవీ ఆమెకు కల్పించడం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఉదయం కట్టుకుని వచ్చిన చీరతోనే శుక్రవారం రాత్రి నిద్రించింది. ఉదయం మార్చుకునేందుకు కొన్ని వస్త్రాలను పోలీసులు అందించారు. ఆమెకు ఆహారంలో చపాతి, వేపుడు, అన్నం, సాంబారు, అప్పడం, పచ్చడి అందించారు. మహిళా అధికారులు సిబ్బందితో ఆమె నవ్వుతూ మాట్లాడుతున్నప్పటికీ, డ్రగ్స్‌కు సంబంధించి నోరు విప్పడం లేదని అధికారులు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దోమలు కుడుతున్నాయంటూ వాపోయిన ఆమె.. రాత్రి రెండు గంటల సమయంలో నిద్రకు ఉపక్రమించి.. శనివారం ఉదయం ఆరు గంటలకు మేల్కొంది. శనివారం ఉదయం 10.30కి సీసీబీ కార్యాలయానికి తరలించి విచారించారు.
  • తాను ఇప్పటి వరకు రెండుసార్లు ఎం.డి.ఎం.ఎం. డ్రగ్‌ తీసుకున్నానని విచారణ సమయంలో రాగిణి అంగీకరించిందని సమాచారం. అవి ఎక్కడ దొరుకుతాయో తనకు తెలియదని రవిశంకర్‌, రాహుల్‌శెట్టి ఇచ్చేవారని తెలిపింది. గంజాయి నింపిన సిగరెట్లూ వారే ఇచ్చేవారని విచారణలో వివరించింది. మద్యంతో పాటు సిగరెట్‌ తాగేదానినని అంగీకరించింది..
  • నిందితుల్లో ఒకడైన వైభవ్‌ జైన్‌ (ఏ5)ను అరెస్టు చేసేందుకు వెళ్లిన సీసీబీ పోలీసులు ఒట్టి చేతులతో వెనక్కు తిరిగి వచ్చారు. కరోనా పాజిటివ్‌ కావడం వల్ల ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారని గుర్తించారు. దివంగత రాజకీయ నాయకుడొకరి కుమారుడితో పాటు మరికొందరు రాజకీయ నాయకుల కుమారులూ డ్రగ్‌ రాకెట్‌లో ఉన్నారని పోలీసులు గుర్తించారు. ఆదిత్య ఆళ్వాతో పాటు రవిశంకర్‌, రాహుల్‌ శెట్టి, కార్తిక్‌ రాజ్‌లకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తించారు. ఆదిత్య ప్రస్తుతం పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఓబరాయ్‌కు ఆదిత్య ఆళ్వా బంధువు.
  • తలరాత కొద్దీ ఆరోపణలు ఎదుర్కొంటున్నానని నటి సంజన వాపోయింది. తనకు మాదక ద్రవ్యాలకు ఎటువంటి సంబంధం లేదని తనను కలుసుకున్న కొందరు విలేకరుల వద్ద శనివారం సాయంత్రం ఆమె వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల సమయంలో రాగిణి భాజపాకు మద్దతుగా కొన్ని చోట్ల ప్రచారం చేసింది. ఆమె పార్టీకి స్టార్‌ ప్రచారకురాలిగా వ్యవహరించిందని మంత్రి సోమశేఖర్‌ చెప్పారు. ఒకవేళ ఆమె నేరానికి పాల్పడి ఉంటే ఎవరూ మద్దతు ఇవ్వరని, ఈ విషయాన్ని చర్చించవలసిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.

కుప్పకూలిన 'డ్రగ్స్‌ రాకెట్‌'

కన్నడనాడును ఓ వైపు మాదక ద్రవ్యాల వ్యవహారం ఉర్రూతలూగిస్తుంటే.. అదే సరకును కొత్తమార్గాల్లో విక్రయించేందుకు సిద్ధమైన మరో డ్రగ్స్‌ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. కేరళకు చెందిన సుబ్రహ్మణి (26), విదూష్‌ (31), షజిల్‌ (21) భారీగా సరకు నగరానికి చేర్చిన విషయం నిఘావర్గాల ద్వారా గుర్తించారు. కేఆర్‌పురంలో వారు అద్దెకు తీసుకున్న నివాసం నుంచి రూ.44 లక్షల విలువైన మాదక ద్రవ్యాలను శనివారం స్వాధీనపరుచుకున్నారు. ఇందులో 2,133 గ్రాముల హశిష్‌, రెండు కిలోల గంజాయి, హశిష్‌ తైలాన్ని నింపేందుకు ఉపయోగపడే 105 ఖాళీ సీసాలు, తూనిక యంత్రం, రెండు చరవాణులు సీజ్‌ చేశామని నగర పోలీసు కమిషనర్‌ కమల్‌ పంత్‌ వెల్లడించారు. అదనపు పోలీసు కమిషనర్‌ సందీప్‌ పాటిల్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. విశాఖపట్నానికి చెందిన కొందరు వ్యక్తుల నుంచి గంజాయి, హశిష్‌ తైలాన్ని కొనుగోలు చేసుకుని నగరానికి తీసుకు వచ్చారని గుర్తించారు. కేఆర్‌పురంలో బాడుగ ఇంట్లో వీటిని నిలువ చేసుకుని, విద్యార్థులు, యువత, ఉద్యోగులకు విక్రయిస్తున్నట్లు సమాచారం. ఎవరైనా ఇళ్లకు వచ్చినప్పుడు వీరి వ్యవహారాన్ని తెలుసుకోకుండా ఉండేందుకు కొబ్బరి నూనె సీసాలనూ నిలువ ఉంచుకునే వారు. ఇతర ప్రాంతాల నుంచి మాదక ద్రవ్యాలను తరలించే సమయంలోనూ కొబ్బరి నూనె డబ్బాలను వెంట తెచ్చేవారు. నిందితుల్లో ఒకడైన విదూష్‌ ఇంగ్లండ్‌లోని బెడ్‌ఫోర్స్‌ షైన్‌లో ఎంమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్‌, ఇంటర్న్‌షిప్‌ అప్లికేషన్‌లో డిగ్రీలను అందుకున్నాడని సందీప్‌ పాటిల్‌ తెలిపారు.

kotwal kamala panth
వినూత్నంగా పెట్టెల్లో సర్దిన మత్తుమందు పరిశీలిస్తున్న కొత్వాలు కమల్‌పంత్‌
DRUG RACKET IN SANDALWOOD
నిందితులు.. విదూష్‌, సుబ్రహ్మణి, షజిల్‌

ఇంద్రజిత్‌పై 'మేఘ' గర్జన

తన భర్తపై అసత్య ఆరోపణలు చేసిన దర్శకుడు ఇంద్రజిత్‌ లంకేష్‌ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని నటి మేఘనారాజ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆమె కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలికి లేఖ రాశారు. తనభర్త అయిన చిరంజీవి సర్జా మృతి చెంది మూడు నెలలు కూడా కాలేదని ఈలోపే ఆయనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మాదక ద్రవ్యాల్ని తీసుకోవడం వల్లనే చిరంజీవి సర్జా హఠాన్మరణం పొందినట్లు ఇటీవల ఇంద్రజిత్‌ లంకేష్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. గర్భవతిగా ఉన్న తాను ఇలాంటి ఆరోపణల వల్ల మానసికంగా ఎంతో కుంగిపోయానని వాపోయారు. కుటుంబ సభ్యులు కూడా ఎంతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. ఈనేపథ్యంలో ఇంద్రజిత్‌ లంకేష్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండు చేశారు.

actress megha sarja
హీరోయిన్ మేఘ సర్జా

నాకేం ఒత్తిడి లేదు

మాదక ద్రవ్యాల వినియోగం, పంపిణీ కేసులో నటి సంజన గల్రానికి నోటీసులు జారీ చేస్తారన్న ప్రచారం జరుగుతున్న సమయంలో- నేను ఎలాంటి ఒత్తిడికీ గురికావడం లేదని ఆమె ప్రకటించారు. తన అపార్ట్‌మెంట్‌ ఆవరణలో కుటుంబ సభ్యుల సహకారంతో రెండు జాగిలాలకు శనివారం స్నానం చేయిస్తూ కొంత సమయం గడిపారు. బాల్కనీలోకి వచ్చి ఫోన్‌లో మాట్లాడుతూ దిగువ వేచి ఉన్న ఫొటోగ్రాఫర్ల కెమెరాలకు ఫోజులు ఇచ్చారు. సంజనకు సన్నిహితుడైన రాహుల్‌ శెట్టిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు.

Last Updated : Sep 6, 2020, 11:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.