ETV Bharat / sitara

ఆరోజున మహేష్ ఫ్యాన్స్​కు డబుల్ ధమాకా! - కృష్ణ పుట్టినరోజు సర్కారు వారి పాట

సూపర్​స్టార్ మహేష్ బాబు అభిమానులకు త్వరలోనే కొత్త కబురు వినిపించనుందని తెలుస్తోంది. మే 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా 'సర్కారు వారి పాట'తో పాటు మహేష్-త్రివిక్రమ్ సినిమాకు సంబంధించిన ఓ అప్​డేట్ రాబోతుందని సమాచారం.

Mahesh Babu
మహేష్
author img

By

Published : May 26, 2021, 6:28 AM IST

సూపర్​స్టార్ మహేష్‌ బాబు సినిమాకు సంబంధించి మరో కొత్త కబురు వినిపించనుందా? అంటే అవుననే అంటున్నాయి తెలుగు సినిమా వర్గాలు. సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టినరోజు వస్తోందంటే ఆయన వారసుడు మహేష్ చిత్రానికి సంబంధించిన కొత్త ప్రకటనో లేక, కొత్త లుక్కో విడుదల చేసేందుకు సిద్ధమవుతుంటాయి చిత్రబృందాలు. ఈసారి కూడా మే 31న 'సర్కారు వారి పాట' ప్రచార చిత్రం విడుదలయ్యే అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

అలాగే ఆ రోజున మహేష్‌-త్రివిక్రమ్‌ సినిమాకు సంబంధించి కూడా కొత్త కబురు వినిపించేందుకు రంగం సిద్ధమైనట్టు తెలిసింది. మరి ఆ రోజున సినిమా పేరుని ప్రకటిస్తారా లేక, ఇతర తారాగణం వివరాల్ని చెబుతారా అనేది తెలియాల్సి ఉంది. మహేష్‌-త్రివిక్రమ్‌ కలయికలో సినిమా ఇటీవలే ఖాయమైంది. 'అతడు', 'ఖలేజా' తర్వాత ఆ ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా ఇదే. ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.