2008లో బాలీవుడ్లో సూపర్ హిట్టయిన చిత్రం దోస్తానా. ఈ సినిమాకు సీక్వెల్‌గా దోస్తానా -2 రాబోతుంది. ఇందులో కార్తీక్ ఆర్యన్, జాన్వీ కపూర్ నటిస్తున్నారు. సినిమాలో వీరిద్దరూ ప్రేమికులు కాదంట.. అన్నాచెల్లెళ్లుగా నటించనున్నట్టు సమాచారం.
అన్నాచెల్లెళ్లు ఇద్దరూ ఒకే వ్యక్తిని ప్రేమిస్తే ఎలా ఉంటుందనేదే చిత్ర కథాంశం. ఆ పాత్ర కోసం కొత్త నటుడిని పరిచయం చేసే ఆలోచనలో ఉన్నారంట కరణ్.
కార్తీక్ ఆర్యన్, జాన్వీ కపూర్ నటిస్తున్నారంటే వీరిద్దరి మధ్య రొమాన్స్ ఉంటుందని మొదట అనుకున్నారు. అయితే దోస్తానా-2లో కొత్త అన్నా చెల్లెళ్ల జంటను పరిచయం చేస్తున్నాడు కరణ్.
ఇది చదవండి: 'జడ్జిమెంట్' జర్నలిస్ట్ వైపే... బాయ్‌కాట్ కొనసాగింపు