బాలీవుడ్ నటీమణులు కొంకణా సేన్ శర్మ, భూమి పెడ్నేకర్ కలిసి నటించిన చిత్రం 'డాలీ కిట్టి ఔర్ వొ చమక్తే సితారే'. అలంకృత శ్రీవాస్తవ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్లో నెట్‌ఫ్లిక్స్ ద్వారా విడుదల చేయనున్నారు. ఈ సినిమా గతేడాది అక్టోబర్ 4, 2019లో బుస్సాన్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ వేదికగా ప్రదర్శితమైంది.
-
What does it feel like to live a perfect life in your own messed up bubble? Dolly should know a thing or two about that.
— Konkona Sensharma (@konkonas) August 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Our new film Dolly Kitty Aur Woh Chamakte Sitaare.
Coming Soon on @NetflixIndia pic.twitter.com/dFEYkH5XMR
">What does it feel like to live a perfect life in your own messed up bubble? Dolly should know a thing or two about that.
— Konkona Sensharma (@konkonas) August 28, 2020
Our new film Dolly Kitty Aur Woh Chamakte Sitaare.
Coming Soon on @NetflixIndia pic.twitter.com/dFEYkH5XMRWhat does it feel like to live a perfect life in your own messed up bubble? Dolly should know a thing or two about that.
— Konkona Sensharma (@konkonas) August 28, 2020
Our new film Dolly Kitty Aur Woh Chamakte Sitaare.
Coming Soon on @NetflixIndia pic.twitter.com/dFEYkH5XMR
ఈ చిత్రంలో కొంకణా సేన్ శర్మ, భూమి పెడ్నేకర్‌లు కజిన్స్గా నటించారు. డాలీ (కొంకణా సేన్) మధ్య తరగతి ఇల్లాలు భర్త , ఓ కుమారుడితో కలిసి దిల్లీలోని శివారు ప్రాంతంలో నివసిస్తుంటుంది. ఈ కుటుంబం ఒక విలాసవంతమైన అపార్ట్ మెంట్‌లో ఉండాలని యోచిస్తుంటుంది.
ఇక ఊరిలో పుట్టి పెరిగిన కాజల్ (భూమి పెడ్నేకర్) నగరానికి చేరకుంటుంది. ఈమెకు సరైన చదువులేకపోవడం వల్ల పట్టణంలో పనిదొరకడం చాలా కష్టంగా మారుతుంది. అందుకని ఓ డేటింగ్ యాప్‌లో కిట్టి అనే పేరుతో సైబర్ ప్రేమికురాలిగా పనిచేస్తుంది. అందులో భాగంగా ఓ వ్యక్తిని కలుస్తుంది. ఆ తరువాత వీరిద్దరి జీవితాల్లో ఏం జరిగిందనేది మిగిలిన కథ. ఇంకా చిత్రంలో విక్రాంత్ మాసే, ముష్తాక్ ఖాన్ అమోల్ పరాషర్, కుబ్రా సైట్, కరణ్ కుంద్రా తదితరులు నటించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">