ETV Bharat / sitara

షారుఖ్​ ఇంటికి వెళ్లాలా? అయితే ఈ అవకాశం మీకోసమే - షారుక్​ ఖాన్​ గౌరీ ఖాన్​ మన్నత్​ భవనం

బాలీవుడ్​ హీరో షారుఖ్​ ఖాన్​ ఇంట్లో ఓరోజు అతిథిగా ఉండాలని ఉందా? ఈ అవకాశాన్ని ఎయిర్​బీఎన్​బీ సంస్థ అభిమానులకు కల్పిస్తుంది. నవంబరు 30లోగా దరఖాస్తులు సమర్పించిన వారికి దిల్లీలోని ఆయన ఇంటిని సందర్శించే అవకాశం ఇవ్వనుంది.

Do you want to go to Sharukh home as a guest
షారుఖ్​ ఇంటికి వెళ్లాలంటే దారిదే!
author img

By

Published : Nov 19, 2020, 9:47 AM IST

అభిమానులు తాము ఎంతగానో ఆరాధించే సినీ నటులను ఒక్కసారైనా కలవాలని వాళ్లతో కనీసం ఒక్క సెల్ఫీ అయినా తీసుకుంటే చాలని భావిస్తుంటారు. ఒకవేళ అలాంటి అవకాశం వస్తే ఆ సెల్ఫీని చూసి ఎంతో మురిసిపోతుంటారు. మరి సెల్ఫీతో సరిపెట్టకుండా.. నేరుగా అభిమాన నటుడి ఇంటికి వెళ్లి అక్కడే ఒకరోజు అతిథిగా ఉండే అవకాశం వస్తే.. కలలో కూడా ఇలాంటి ఆలోచన రాదేమో కదా..!

కానీ.. అలాంటి అవకాశం షారుఖ్​ అభిమానులకు వచ్చింది. అతిథుల రాకకోసం దిల్లీలో ఉన్న తమ ఇంటిని అతని భార్య గౌరీఖాన్‌ అందంగా తీర్చిదిద్దింది కూడా. ఈమేరకు కింగ్‌ఖాన్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఇంటికి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో ఆయన పంచుకున్నారు. ఇంతకీ షారుఖ్​ ఇంటికి వెళ్లడం ఎలా అని ఆలోచిస్తున్నారా..? 'ఎయిర్‌బీఎన్‌బీ' అనే అమెరికన్‌ వెకేషన్‌ రెంట్‌ ఆన్‌లైన్‌ మార్కెట్‌ సంస్థ ఈ అరుదైన అవకాశాన్ని కల్పిస్తోంది.

"గౌరీని నేను తొలిసారిగా కలిసింది కూడా దిల్లీలోనే. రాజధాని నగరం మా హృదయాల్లో ఎంతో ప్రత్యేకమైన స్థానం సంపాదించింది" అని షారుఖ్‌ ఆ పోస్టు చేశారు. "నా భార్య గౌరీఖాన్‌ మా ఇంటిని ఎంతో అందంగా అలంకరించింది. ప్రేమ, జ్ఞాపకాలతో ఆమె ఇల్లంతా నింపేసింది. మీరు అతిథిగా మారి మాఇంటికి వచ్చే అవకాశం ఎయిర్‌బీఎన్‌బీ కల్పిస్తోంది" అని అన్నారు. ఆసక్తి ఉన్నవారు నవంబర్‌ 30 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చని ఎయిర్‌బీఎన్‌బీ సంస్థ పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.