ETV Bharat / sitara

బాలకృష్ణను ఎన్టీఆర్ కొడతానన్న ఆ సందర్భం! - ఆ సినిమా షూటింగ్​లో బాలకృష్ణను హెచ్చరించారంటా

ఎప్పుడు క్రమశిక్షణగా ఉండే హీరో బాలకృష్ణను, ఆయన తండ్రి ఎన్టీఆర్ ఓసారి కొడతానని అన్నారు. ఎందుకు అలా హెచ్చరించారు? ఇది ఎప్పుడు జరిగింది?

balakrishna
బాలకృష్ణ
author img

By

Published : Jun 10, 2020, 1:26 PM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ క్రమశిక్షణ ఉంటుంది. సినిమా సెట్​లో అడుగుపెట్టారంటే దృష్టంతా కేవలం నటన మీదే. యాక్షన్​ అనగానే పాత్ర ఏదైనా సరే అందులో ఒదిగిపోతారు. అయితే దీనంటికి కారణం ఆయన తండ్రి నందమరి​ తారకరామారావు అని చెప్పుకొచ్చారు బాలయ్య. ఓసారి షూటింగ్​లో నాన్న, తనను కొడతానని హెచ్చరించిన సందర్భాన్ని 'ఈనాడు'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు.

"కడపజిల్లా అనంతరాజుపేట దగ్గర 'శ్రీ మద్విరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర' సినిమా షూటింగ్‌ జరుగుతోంది. చుట్టూ జనం ఉండగా, నాపై(సిద్ధయ్య పాత్ర) షాట్‌ తీస్తున్నారు. నేను కంగారులో రెండు మూడు టేక్‌లు తీసుకుంటున్నా. అప్పుడు నాన్న కొడతా అని హెచ్చరించారు. మరోవైపు అభిమానులను సముదాయించి, నాచేత ఆ సన్నివేశం‌ చేయించారు. ఆయన నేర్పిన క్రమశిక్షణ వల్లే ఇన్ని సినిమాలు తీయగలిగాను. నన్ను నమ్మిన నిర్మాతలు, దర్శకుల వల్ల నందమూరి వారసత్వాన్ని కొనసాగిస్తున్నా"

-బాలకృష్ణ, టాలీవుడ్​ అగ్రకథానాయకుడు

నేటితో ఆయన 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్​మీడియలో పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. వారిలో మెగాస్టార్ చిరంజీవి, జూ.ఎన్టీఆర్​, శ్రీకాంత్​, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తదితరులు ఉన్నారు.

ఇది చూడండి :

'నాలో అభిమానిని తట్టిలేపింది మీరే'

అలసట తెలియని యోధుడు.. ఈ నందమూరి అందగాడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.