ETV Bharat / sitara

ఏడాదికి డజనుకు పైగా సినిమాలు.. ఆ హీరోల జోరుకు సలాం! - కృష్ణ ఏడాదికి 18 సినిమాలు

టాలీవుడ్​కు చెందిన పలువురు హీరోలు ఒకప్పుడు ఏడాదికి డజనుకు పైగా చిత్రాలతో జోరు చూపించారు. వరుస పెట్టి సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద సందడి చేశారు. ఈ నేపథ్యంలో ఒక ఏడాదిలో ఏ హీరో సినిమాలు ఎక్కువ వచ్చాయో చూద్దాం.

Tollywood
టాలీవుడ్
author img

By

Published : Aug 20, 2021, 12:54 PM IST

ప్రస్తుతం టాలీవుడ్ అగ్రహీరోలు ఏడాదికి ఒక్క సినిమా చేయడం గగనంగా మారిపోయింది. చాలా అరుదుగా వారి నుంచి సంవత్సరానికి రెండు చిత్రాలు విడుదల అవుతున్నాయి. కానీ కొంతకాలం క్రితం వరకు మన హీరో, హీరోయిన్లు ఏటా 10కి పైగా సినిమాలతో జోరు చూపించారు. పోటాపోటీగా బాక్సాఫీస్ వద్ద వారి సత్తా చూపారు. అలా ఏడాదికి అత్యధికంగా ఎవరు ఎన్ని సినిమాలు చేశారో చూద్దాం.

ఒక్క సంవత్సరంలో ఎవరు ఎన్ని సినిమాలు చేశారంటే?

కృష్ణ (18)

తెలుగు చలనచిత్ర రంగంలో నూతన ఒరవడి సృష్టించి, అధునాతన సాంకేతిక విలువలకు పట్టంకట్టి, పడిలేచిన కెరటంలా విజృంభించిన నటుడు సూపర్ స్టార్ కృష్ణ. నాలుగు దశాబ్దాల పాటు తనదైన ముద్రతో అభిమానులను అలరించిన ఈ మేరునగధీరుడు విభిన్న కథలను ఎంచుకుంటూ టాలీవుడ్ పంథా మార్చారు. అలాగే ఏడాదికి 10కిపైగా సినిమాలు చేస్తూ బిజీగా గడిపారు. అత్యధికంగా ఓ ఏడాది కృష్ణ 18 సినిమాలు చేశారు. 1972లో వరుస చిత్రాలతో ఈ ఘనత సాధించారు.

Krisna
కృష్ణ

ఎన్టీఆర్​ (17)

తెలుగు తెరపై తన పేరును శాశ్వతంగా ముద్రించుకుని.. నట సౌర్వభౌముడిగా.. యుగపురుషుడిగా ఖ్యాతి గడించారు నందమూరి తారకరామ రావు. ఎన్నో మరపురాని చిత్రాలను ప్రేక్షకులకు అందించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఎన్టీఆర్ కూడా ఏడాదికి డజనుకు పైగా సినిమాలు చేసిన దాఖలాలు ఉన్నాయి. 1964లో ఈయన నటించిన 17 సినిమాలు రిలీజయ్యాయి. అప్పటివరకు ఇదే అత్యధికం.

NTR
ఎన్టీఆర్

కృష్ణంరాజు (17)

యాక్షన్ చిత్రాలతో రెబల్​స్టార్​గా గుర్తింపు తెచ్చుకున్నారు కృష్ణంరాజు. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ వంటి హీరోలతో పోటీపడి ఏడాది 10కి పైగా సినిమాలు చేశారు. అత్యధికంగా ఈయన నటించిన 17 సినిమాలు 1974లో విడుదలయ్యాయి.

Krishnamraju
కృష్ణంరాజు

రాజేంద్రప్రసాద్​ (17)

హీరోలు కూడా నవ్వించగలరని చూపించి.. కథానాయకుడి పాత్రకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన నటుడు రాజేంద్రప్రసాద్. ఆయన కెరీర్​లో ఇప్పటి వరకు రెండు వందలకు పైగా సినిమాల్లో నటించారు. ఏడాదికి డజనుకు పైగా సినిమాలతో తెలుగు ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించారు. అత్యధికంగా రాజేంద్రప్రసాద్ నుంచి 1988లో 17 సినిమాలు విడుదలయ్యాయి.

rajendra prasad
రాజేంద్రప్రసాద్

చిరంజీవి (14)

నర్తిస్తే నటరాజు కూడా మెచ్చుకుంటాడు. నటిస్తే ప్రతి తెలుగు వాడు పొంగిపోతాడు. కనిపిస్తే ప్రతి అభిమాని ఆరాధిస్తాడు. ఇలా ఎంతో మంది హృదయాల్లో చెరగని ముద్రవేసిన నటుడు మెగాస్టార్ చిరంజీవి. తన నటనతో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న చిరు వరుస పెట్టి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద చరిత్ర తిరగరాశారు. అత్యధికంగా మెగాస్టార్ నుంచి 1980లో 14 సినిమాలు విడుదలయ్యాయి.

Chiranjeevi
చిరంజీవి

శోభన్​బాబు (12)

వెండితెర సోగ్గాడిగా అభిమానుల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోయిన కథానాయకుడు శోభన్‌బాబు. క్రమశిక్షణ కలిగిన జీవితానికి ఆయన ప్రతీక. అలాగే సినిమాల్లోనూ కుటుంబకథా చిత్రాలకు పెద్దపీట వేశారు. శోభన్​బాబు కూడా ఏడాదికి 10 సినిమాలు చేసిన దాఖలాలు ఉన్నాయి. ఈయన నటించిన 12 సినిమాలు 1980లో విడుదలయ్యాయి.

అక్కినేని నాగేశ్వరరావు (9)

'దేవదాసు', 'ప్రేమనగర్'​, 'దసరాబుల్లోడు' వంటి మచ్చుతునక చిత్రాల్లో అద్భుతమైన నటన కనబరచి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన హీరో అక్కినేని నాగేశ్వరరావు. చిత్ర సీమకు ఆయన చేసిన కృషి అనంతరం. ఎన్టీఆర్​తో పాటు ఏన్నాఆర్ తెలుగు సినీ పరిశ్రమకు రెండు కళ్లు అంటూ చెబుతారు. సినిమాల విషయంలోనూ నాగేశ్వర రావు దూకుడు చూపించారు. 10 కాకపోయినా 1960, 1971, 1984లో తొమ్మిదేసి చిత్రాలు చేశారు.

ANR
నాగేశ్వర రావు

వీరితో పాటు మరికొందరు నటులు.. వారి నుంచి ఏడాదిలో విడుదలైన అత్యధిక సినిమాల గురించి చూద్దాం.

అల్లరి నరేశ్​ (8 సినిమాలు 2008లో)

బాలకృష్ణ (7 సినిమాలు 1987లో)

జగపతిబాబు (6 సినిమాలు 1996లో)

ఇక హీరోయిన్ల విషయానికి వస్తే..

నయనతార (7 సినిమాలో 2019లో)

తమన్నా (8 సినిమాలు, 2019లో)

కీర్తిసురేశ్ (7 సినిమాలు, 2018లో)

తాప్సీ (7 సినిమాలు, 2011లో)

ప్రియమణి (9 సినిమాలు, 2010లో)

ప్రియమణి (7 సినిమాలు, 2009లో)

స్నేహ (7 సినిమాలు, 2008లో)

శ్రియా శరణ్ (8 సినిమాలు, 2005లో)

స్నేహ (7 సినిమాలు, 2002లో)

ఇవీ చూడండి: మన హీరోలకు విలన్లు.. అదిరే కాంబినేషన్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.