భారతీయ చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర నటుల్లో ఒకడు మమ్ముట్టి. దశాబ్దాల తరబడి కేరళ చిత్రసీమను శాసిస్తున్నాడు ఈ స్టార్ కథానాయకుడు. ఇంతటి క్రేజ్ సంపాదించుకున్న మమ్ముట్టికి ఆపేరు ఎలా వచ్చిందో తెలుసా?.. ఇందుకు కారణం ఆయన స్నేహితులేనట.
మమ్ముట్టి అసలు పేరు మహ్మద్ కుట్టి. చిత్ర పరిశ్రమకొవచ్చిన కొత్తలో ఆయన పేరు పలకటం కష్టంగా ఉందని మమ్ముట్టిగా మార్చేశారట ఆయన మిత్ర బృందం. అంతే కాదు మమ్ముట్టి లాయర్ కూడానట. తెలుగు, మలయాళం, తమిళ, హిందీ బాషల్లో కలిపి 400 చిత్రాల్లో నటించాడు. తెలుగులో స్వాతికిరణం, యాత్ర చిత్రాలతో గుర్తింపు సంపాదించాడు.
ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'మామాంగం' చిత్రం అన్ని బాషల్లో విడుదలవటానికి సిద్ధంగా ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చూడండి.. 'మహిళలు బలంగా ఉండరని ఎవరన్నారు..'