కన్న బిడ్డలపై ప్రేమతో వారి పేర్లను ఇంటికో, సొంత వ్యాపార దుకాణానికో పెట్టి మురిసిపోయే తల్లిదండ్రులు చాలా మంది ఉంటారు. ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ విషయంలో మాత్రం అది రివర్స్‌లో జరిగింది. ఆయన తండ్రి సురేశ్ హిరాణీ ఓ టైపింగ్ ఇన్స్టిట్యూట్ నడిపేవారు. దాని పేరు రాజ్‌కుమార్ ఇన్స్టిట్యూట్. తన కొడుకు పేరుమీద అలా పెట్టారేమో అనుకుంటే పొరబడినట్లే! అప్పటికి ఇంకా ఆయనకు పెళ్లే కాలేదు.
అయితే ఆ ఇన్స్టిట్యూట్కు తక్కువ కాలంలోనే మంచి పేరొచ్చింది. దాని వల్ల సురేశ్ హిరాణీ ఆర్థికంగా స్థిరపడ్డారు. ఆ తర్వాత వివాహం చేసుకుని ఓ బిడ్డకు తండ్రయ్యారు. తనకు బాగా కలిసొచ్చిన రాజ్‌కుమార్ పేరును సెంటిమెంట్‌గా భావించి, తన బిడ్డకూ అదే పేరు పెట్టారు. ఆ సెంటిమెంట్ ప్రభావమో ఏమో కానీ రాజ్‌కుమార్ హిరాణీ దర్శకుడిగా గొప్ప పేరు తెచ్చుకున్నారు.
కొసమెరుపేంటంటే తండ్రి నడిపిన టైపింగ్ ఇన్స్టిట్యూట్కు గుర్తుగా ఇప్పటికీ ఓ పాత టైపింగ్ మెషీన్‌ను తన ఆఫీసులో భద్రంగా దాచుకున్నారు దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ.