ఛత్తీస్‌గడ్‌లోని ఇటీవలే సీఆర్పీఎఫ్ జవాన్లపై మావోయిస్టు బృందం దాడి చేసింది. దీని ఫలితంగా 22 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో మావోయిజం, నక్సలిజం లాంటి భావాజాలాలను ప్రోత్సహించే చిత్రాలను తెలుగు చిత్రసీమలో నిర్మిస్తున్నారని తీవ్రవాద నిరోధక ఫోరం (ఏఎఫ్‌టీ) బృంద సభ్యులు అంటున్నారు. చిరంజీవి, రామ్‌చరణ్, రానా నటిస్తున్న 'ఆచార్య', 'విరాట పర్వం' సినిమాలు ఈ కోవకే చెందినవని వారు అభిప్రాయపడ్డారు.

అయితే సమాజంలో ఏర్పడిన ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నక్సలిజం భావజాలాన్ని ప్రోత్సహించే చిత్రాలకు ధ్రువీకరణ పత్రం ఇవ్వొద్దని ఏఎఫ్‌టీ బృందం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సెన్సార్(సీబీఎఫ్సీ)కి విన్నవించుకుంది. భవిష్యత్‌లోనూ ఇలాంటి చిత్రాలకు సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయకూడదని ఆ సభ్యులు సూచించారు. యువతపై దుష్ప్రభావం చూపించే అవకాశం ఉన్నందున ఈ సినిమాల విడుదలకు తాము వ్యతిరేకమని వెల్లడించారు. ఒకవేళ ఆ చిత్రాలు థియేటర్లలో విడుదలైతే వాటిని అడ్డుకుంటామని ఏఎఫ్‌టీ సభ్యులు తేల్చిచెప్పారు.


ఇదీ చూడండి: క్యాష్ షోలో 'వకీల్‌సాబ్' టీమ్ సందడి