'ఐరన్‌మ్యాన్' ఫేమ్ రాబర్ట్ డౌనీ జూనియర్ ఎంచక్కా జంతువులతో ముచ్చట్లు పెట్టేస్తున్నాడు. పక్షులతోనూ హాయ్ అంటూ మాట కలిపేస్తున్నాడు. అవి చెప్పే విషయాలను అర్థం చేసుకుంటూ వాటి బాధలను, సంతోషాలను పంచుకుంటున్నాడు. అదెలా సాధ్యం అంటే అతడికో అద్భుత శక్తి ఉంది. దాని సాయంతో జంతువుల నేస్తంగా మారిపోయాడు. డాక్టర్ అయిన రాబర్ట్ జంతువుల కోసం అవసరమైతే రోగులను కూడా వదిలేసి పోతాడట. ఆ కథేంటో తెలియాలంటే ‘డూలిటిల్’ చూడాల్సిందే. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
రాబర్ట్ డౌనీ జూనియర్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. డాక్టర్ డూలిటిల్ అనే ప్రఖ్యాత పాత్ర ఆధారంగా రూపొందుతోంది. ధ్రువపు ఎలుగుబంటి, గొరిల్లా, ఆడ సింహం, పులి, జిరాఫీ, నక్క, కుక్క, రామ చిలుక, బాతు తదితర పాత్రలు కీలకం. వీటికి టామ్ హొలాండ్, సెలెనా గోమెజ్, జాన్ సెనా, ఎమ్మా థాంప్సన్ తదితర ప్రముఖులు గొంతు అరువిచ్చారు. స్టీఫెన్ గఘన్ దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది చదవండి: మెగాస్టార్ చిరంజీవితో సుకుమార్ సినిమా.. ?