ETV Bharat / sitara

పేరే కాదు ముక్కు మార్చుకోమన్నారు: జాక్వెలిన్ - saaho Jacqueline

ముద్దుగుమ్మ జాక్వెలిన్.. ఇటీవలే ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తనకెదురైన అనుభవాలను పంచుకుంది. తనను పేరు మార్చుకోమన్నారని చెప్పింది.

పేరే కాదు ముక్కు మార్చుకోమన్నారు: జాక్వెలిన్
జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌
author img

By

Published : Mar 6, 2020, 11:24 AM IST

చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన కొత్తలో కొందరు వ్యక్తులు తనను పేరు మార్చుకోమని సూచించారని అంటోంది బాలీవుడ్ భామ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌. శ్రీలంకకు చెందిన ఈమె.. సినిమాల్లో నటించాలనే ఉద్దేశంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి, ముంబయిలో మకాం ఏర్పాటు చేసుకుంది. తాజాగా ఓ ఆంగ్లపత్రిక నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది.

Jacqueline Fernandez
బాలీవుడ్ భామ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌

'సినిమాల్లోకి వచ్చి దాదాపు పదేళ్లవుతుంది. తలుచుకుంటే చాలా సంతోషంగా ఉంది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు విభిన్నంగానే ఉండాలని ఎప్పుడూ అనుకోలేదు. నాలాగానే ఉండాలనుకున్నాను. ఆ సమయంలో కొందరు.. జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ అనే పేరు వినడానికి మరీ పాశ్చాత్యంగా, చాలా కొత్తగా ఉందన్నారు. కాబట్టి నా పేరును ముస్కన్‌ అని మార్చుకోమన్నారు. కానీ నేను మాత్రం అది ఇష్టం లేదని చెప్పాను. మరికొందరైతే చిన్నప్పటి నుంచి నాకెంతో ఇష్టమైన ముక్కును మార్చుకోమన్నారు. (ముక్కును షేప్‌ చేయించుకోమన్నారు)' -జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్ , నటి

2009లో 'అల్లాదీన్‌' సినిమాతో నటిగా బాలీవుడ్‌కు పరిచయమైన జాక్వెలిన్.. ఇప్పటివరకూ ఎందరో అగ్ర, యువ హీరోలతో నటించి ప్రేక్షకులను మెప్పించింది. గతేడాది వచ్చిన 'సాహో'లో ప్రత్యేక గీతంలో కనిపించి, అలరించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.