ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ తెరకెక్కించిన చిత్రం 'ములన్'. 1998లో యానిమేటెడ్ రూపంలో విడుదలైన 'ములన్' సినిమాకు ఇది సీక్వెల్. చారిత్రక యుద్ధ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి నిక్కీ కారో దర్శకత్వం వహించారు. ఇందులో హాలీవుడ్ నటి లియు-హువా టైటిల్ రోల్ పోషించింది. ఈ చిత్రం మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ, కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఓటీటీ వేదికగా రిలీజ్ చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. సెప్టెంబరు 4న డిస్నీ ప్లస్‌లో విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది.
అమెరికాలో కాకుండా మరే దేశంలోనైనా 'ములన్' చిత్రాన్ని చూడాలంటే దాదాపుగా రూ. 2,300లను వెచ్చించాల్సి ఉంటుందట. కేవలం ఈ సినిమా కోసమే డిస్నీ తీసుకొస్తున్న కొత్త పద్ధతి ఇది. అయితే ఈ పద్ధతిని భవిష్యత్‌లో ఆచరించమని నిర్మాణ సంస్థ చెబుతోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కథేంటంటే
ఉత్తర దేశాల ఆక్రమణల నుంచి తమ దేశాన్ని రక్షించడానికి ప్రతి ఇంటి నుంచి ఒకరు సైన్యంలో చేరాలని చైనా చక్రవర్తి ఉత్తర్వులు జారీ చేస్తారు. దాంతో ఆ దేశ సైన్యాధ్యక్షుడి కూతురు హువా ములన్ (లియు) సైన్యంలో చేరడానికి ముందుకొస్తుంది. ఆ తర్వాత ఆమె సైన్యంలో ఎన్నో కఠినమైన పరీక్షలను ఎదుర్కొంటుంది. సైనికులతో కలిసి ఆమె తమ దేశాన్ని ఎలా కాపాడింది అనేది మిగిలిన కథ.
దేశ చక్రవర్తిగా నటుడు జెట్ లీ, కమాండర్ టంగ్గా డొన్ని యెన్, యసోన్ అన్గా చెన్-హొంగొయ్, బేరి ఖాన్ పాత్రలో జాసన్ స్కాట్ లీ నటించారు. వాల్డ్ డిస్నీ పిక్చర్స్, జాసన్.టి.రీడ్ ప్రొడక్షన్స్, గుడ్ ఫియర్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి వాల్ట్ డిస్నీ స్టూడియోస్ అండ్ మోషన్ పిక్చర్స్ పంపిణీ దారులుగా వ్యవహరిస్తున్నారు. హ్యారీ గ్రెగన్స్-విలియమ్స్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు.