ETV Bharat / sitara

బన్నీ 'పుష్ప'లో బాలీవుడ్​ హాట్ హీరోయిన్ - పుష్ప' చిత్రంలో బాలీవుడ్​ హాట్​ బ్యూటీ దిశాపటానీ

అల్లుఅర్జున్-సుకుమార్​ కాంబోలో తీస్తున్న 'పుష్ప'లో, బాలీవుడ్​ స్టార్ బ్యూటీ దిశా పటానీ ప్రత్యేక గీతంలో కనిపించనుందని టాక్​.

Disha Patani to shake a leg with Allu Arjun in Pushpa
బన్నీ 'పుష్ప'లో బాలీవుడ్​ హాట్​ బ్యూటీ
author img

By

Published : May 3, 2020, 11:14 AM IST

తెలుగులో 'లోఫర్' సినిమా​తో అరంగేట్రం చేసిన నటి దిశా పటానీ.. అనంతరం 'ఎమ్​.ఎస్.ధోనీ', 'భాఘీ 2', 'భారత్', 'భాఘీ 3' వంటి చిత్రాలతో మెప్పించింది. తన అందంతో ఆకట్టుకుంటూ బాలీవుడ్​లో వరుస ప్రాజెక్టులు చేస్తోంది. త్వరలో టాలీవుడ్​లో మరోసారి సందడి చేయనుందని సమాాచరం. అయితే ఈసారి ప్రత్యేక గీతంతో అలరించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

దర్శకుడు సుకుమార్ తీసే ప్రతి సినిమాలోనూ ఓ ప్రత్యేక గీతం ఉంటుంది. 'అ అంటే అమలాపురం', 'రింగా రింగా', 'జిగేల్ రాణి' ఆ తరహా పాటలే. ప్రస్తుతం తాను తెరకెక్కిస్తున్న 'పుష్ప'లోనూ అలాంటి గీతమే ఉండేలా చూస్తున్నాడు. ఇందులో నటించేందుకు బాలీవుడ్​ భామ దిశా పటానీని ఎంపిక చేశారట.

Disha Patani to shake a leg with Allu Arjun in Pushpa
దిశా పటానీ

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న 'పుష్ప' షూటింగ్.. ప్రస్తుతం లాక్​డౌన్ కారణంగా నిలిచిపోయింది. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్​. విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.