పూరీజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన నటి దిశాపటాని. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడం వల్ల బాలీవుడ్‌కు మకాం మార్చింది. అక్కడ వరుసపెట్టి సినిమాల్లో నటిస్తోన్న ఈ భామ ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. తాజాగా జిమ్‌లో కసరత్తులు చేస్తున్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.
జీరోసైజు బాడీతో కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది దిశా. జిమ్‌లో సాధన చేస్తున్న ఫొటోలు అంతర్జాలంలో వైరల్‌గా మారాయి. సూపర్ షేప్ అంటూ నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు.
ప్రస్తుతం ఆదిత్యరాయ్‌కపూర్ సరసన మలంగ్ చిత్రంలో నటిస్తోంది దిశా. మోహిత్ సూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ఏడాది 'భారత్' చిత్రంతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుందీ భామ.
ఇది చదవండి: భాయ్ ప్రస్థానానికి 31 ఏళ్లు... ఫ్యాన్స్‌కు గిఫ్ట్