దిశా పటానీ.. ప్రస్తుతం బాలీవుడ్లో తన అందం, నటనా నైపుణ్యంతో దూసుకెళ్తోంది. ఇటీవల 'మలంగ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిందీ భామ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితం అందుకుంది. ఈ కారణంగా నిర్మాతలు ఓ సక్సెస్ పార్టీని ఏర్పాటుచేశారు. దీనికి పలువురు సెలిబ్రిటీలు హాజరయ్యారు. చిత్రబృందంతో పాటు హీరోయిన్ దిశా కూడా వచ్చింది.
![Disha Patani Honest Reply To Krishna Shroff](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6442518_dis.jpg)
సక్సెస్ పార్టీలో మెరూన్ దుస్తుల్లో మెరిసిపోతూ కనిపించింది దిశా. కొద్ది సమయంలోనే సామాజిక మాధ్యమాల్లో ఆ ఫొటో వైరల్‌గా మారింది. దీనికి నెటిజన్లు విపరీతంగా స్పందించారు. అయితే ఓ స్టార్ హీరో సోదరి కొంచెం అడ్వాన్స్‌గా ఓ ప్రశ్న అడిగింది. ఆమెవరో కాదు టైగర్ ష్రాఫ్ సోదరి కృష్ణా ష్రాఫ్.
![Disha Patani Honest Reply To Krishna Shroff](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6442518_dis-1.jpg)
"ఇలాంటి దుస్తుల కోసం ఇప్పటికే ఆర్డర్ ఇచ్చా. కానీ ఇప్పటివరకు అవి డెలివరీ కాలేదు. ఈ దుస్తుల సైజ్ ఎంత?"
-కృష్ణా ష్రాఫ్, టైగర్ ష్రాఫ్ సోదరి
అయితే ఈ ప్రశ్నకు హుందాగా సమాధానం చెప్పింది దిశా పటానీ. ఈ దుస్తులు వేసుకోవడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నాయని తెలిపింది. దీనిని చూసిన నెటిజన్లు దిశా సమయస్ఫూర్తికి ఫిదా అవుతున్నారు.
![Disha Patani Honest Reply To Krishna Shroff](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6442518_dis-2.jpg)
![Disha Patani Honest Reply To Krishna Shroff](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6442518_dis-3.jpg)