విశ్వక్‌సేన్ కథానాయకుడిగా శైలేశ్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ 'హిట్'. రుహాని శర్మ కథానాయిక. వాల్‌పోస్టర్ సినిమా పతాకంపై నాని ఈ సినిమాను నిర్మించాడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక జరిగింది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి, నటి అనుష్క, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, రానా తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా వ్యాఖ్యాత సుమ, దర్శకుడు రాజమౌళి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది.
సుమ: ముగ్గురు కో-డైరెక్టర్‌లు.. ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్ల భార్యలు మీపై కేసులు నమోదు చేశారు? సినిమా ఎప్పుడు అవుతుందోనని అడుగుతున్నారు.
రాజమౌళి: కేవలం కో-డైరెక్టర్ల భార్యలే ఫిర్యాదు చేశారా? హీరోల ఫ్యాన్స్ చేయలేదా?
సుమ: చేశారు సర్.. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల ఫ్యాన్స్ నుంచి కూడా ఫిర్యాదులు అందుతున్నాయి. మా హీరోలను మీ దగ్గర పెట్టుకున్నారు. ఎప్పుడు రిలీజ్ చేస్తారని అంటున్నారు. డేట్ పక్కాగా చెబితే కేసు క్లోజ్ చేసేద్దాం.
రాజమౌళి: ఇప్పటికే చెప్పాం కదా!
సుమ: మే 2021న విడుదల చేస్తారా?
రాజమౌళి: సంక్రాంతికి రాబోతున్నారు. 2021 జనవరి 8వ తేదీన విడుదల చేస్తాం.
సుమ: ప్రతి సినిమా ఎలా హిట్ చేస్తున్నారని వేరే వాళ్లు కేసులు పెట్టారు. దీనికి ఫార్ములా ఏదైనా ఉందా? అని అడుగుతున్నారు.
రాజమౌళి: మీరు ఇలాంటి కేసులన్నీ తీసుకోకూడదు. ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేయకూడదు. బైలాస్ ఉండదు.
సుమ: మాకు బైలాస్ ఎక్కడుంది సర్.. అన్నీ బైపాస్‌లాస్‌లే.. ఏ లాస్ అయినా బైపాస్ చేసుకుని వెళ్లిపోతాం. అంటూ ఇద్దరి మధ్య చిన్న ఆసక్తికర చర్చ నడిచింది. ఈ సందర్భంగా కార్యక్రమానికి వచ్చిన వారందరికీ నవ్వులు పంచారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">