ETV Bharat / sitara

'చిరంజీవితో ఆ మాట చెప్పలేకపోయా.. అందుకే ఆ సినిమా ఆడలేదు!' - దర్శకుడు శ్రీనువైట్ల

మెగాస్టార్​ చిరంజీవి మాట కాదనలేక 'అందరివాడు' సినిమా తెరకెక్కించినట్లు వెల్లడించారు దర్శకుడు శ్రీనువైట్ల. ఆ మూవీ ఎందుకు ఫ్లాప్​ అయిందో వివరించారు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేసిన ఈ దర్శకుడు.. తన కెరీర్​ గురించి ఆసక్తికర సంగతులు తెలిపారు.

chiru
చిరు
author img

By

Published : Nov 2, 2021, 10:09 AM IST

Updated : Nov 2, 2021, 11:48 AM IST

'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి దర్శకుడు శ్రీనువైట్ల అతిథిగా విచ్చేసి కెరీర్​కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇంట్లో చెప్పకుండా మద్రాస్​ పారిపోయి సినీఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన.. తాను దర్శకత్వం వహించిన తొలి సినిమానే 'అపరిచితుడు'(రాజశేఖర్​తో) మధ్యలో ఆగిపోయినట్లు గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత 'నీకోసం'(రవితేజతో) హిట్​ అవ్వడం వల్ల రామోజీరావు పిలిచి మరి 'ఆనందం' సినిమా అవకాశమిచ్చినట్లు తెలిపారు.

'నీ సినిమాల్లో మందు కొట్టే సీన్ ఎందుకు ఉంటుంది అని' అలీ అడగగా.. అందుకు గల కారణాన్ని చెబుతూ 'దూకుడు'లో మందు సీన్​ ఉండాలని హీరో మహేశ్​ పట్టుపట్టినట్లు శ్రీను తెలిపారు. దర్శకుడు వి.వి. వినాయక్​తో జరిగిన ఓ సరదా సంఘటన చెప్పారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

​'దూకుడు' రీమేక్ చేయాలని తమిళ హీరో అజిత్ తనను అడిగినట్లు చెప్పిన శ్రీనువైట్ల.. ఆ చిత్రాన్ని అజిత్​తో చేయనందుకు ఇప్పటికీ బాధపడుతున్నట్లు వెల్లడించారు. మహేశ్​తో 'ఆగడు' సినిమా ఎందుకు చేయాల్సివచ్చిందో వివరించారు. దీంతో పాటే చిరంజీవితో తాను తెరకెక్కించిన తొలి సినిమా 'అందరివాడు' ఎందుకు ఫ్లాప్​ అయిందో చెప్పారు. "ఆ కథ నాది కాదు. ఆయన చెప్పడం వల్లే సినిమా తీశా. చిరు పెద్ద మనిషి అవ్వడం వల్ల 'సినిమా చేయను' అని అనలేకపోయా" అని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమం పూర్తి ఎపిసోడ్​ నవంబరు 8న ప్రసారం కానుంది. అప్పటివరకు దీనికి సంబంధించిన ప్రోమోను చూసేయండి..

ఇదీ చూడండి: 'అందుకే పవర్​స్టార్​ను 40సార్లు పెళ్లి చేసుకుంటా!'

Last Updated : Nov 2, 2021, 11:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.