ETV Bharat / sitara

షాక్​లోకి వెళ్లా.. నిద్రలేని రాత్రులు గడిపా: శంకర్

'భారతీయుడు-2' షూటింగ్​లో జరిగిన క్రేన్ ప్రమాదంపై దర్శకుడు శంకర్ ఎట్టకేలకు స్పందించాడు. చాలా భావోద్వేగంతో ట్వీట్ చేశాడు.

షాక్​లోకి వెళ్లా.. నిద్రలేని రాత్రులు గడిపా: శంకర్
దర్శకుడు శంకర్
author img

By

Published : Feb 26, 2020, 5:58 PM IST

Updated : Mar 2, 2020, 3:58 PM IST

హీరో కమల్‌హాసన్‌, ప్రముఖ దర్శకుడు శంకర్‌ కలిసి తీస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'భారతీయుడు-2'. ఇటీవలే ఈ సినిమా సెట్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నైలోని ఈవీసీ స్టూడియోలో లైటింగ్‌ కోసం సెట్‌ వేస్తున్న తరుణంలో 150 అడుగుల ఎత్తు నుంచి క్రేన్‌ తెగి చిత్రబృందం ఉండే టెంట్‌పై పడింది. ఈ ఘటనలో శంకర్‌ వ్యక్తిగత సహాయకుడు మధు(29), అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సాయికృష్ణ(34), సహాయకుడు చంద్రన్‌ మృతి చెందారు. ఈ నేపథ్యంలో దర్శకుడు శంకర్‌ భావోద్వేగభరిత ట్వీట్ చేశాడు. ఆ ప్రమాదం ఏదో తనకే జరుగుంటే బాగుండేదని రాసుకొచ్చాడు.

  • It is with utmost grief, I’m tweeting.Since the tragic incident,I’ve been in a state of shock & having sleepless nights on the loss of my AD & crew.Having missed the crane by a whisker,I feel it would’ve been better if it was on me. Heartfelt condolences & prayers to the families

    — Shankar Shanmugham (@shankarshanmugh) February 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'ఎంతో దుఖంతో ఈ ట్వీట్‌ చేస్తున్నా. ఇంకా ఆ షాక్‌లోనే ఉన్నా. ఆ ప్రమాదంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌, ఇతర సిబ్బందిని కోల్పోవడం ఎంతో బాధగా ఉంది. ప్రమాదం జరిగినప్పటి నుంచి నిద్రలేని రాత్రులను గడుపుతున్నా. త్రుటిలో క్రేన్‌ ప్రమాదం నుంచి తప్పించుకున్నా. ఆ క్రేన్‌ నా మీదే పడుంటే బాగుండేదనిపిస్తుంది. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను' -శంకర్‌, దర్శకుడు

ఈ ప్రమాదం జరిగిన తర్వాత, అందుకు కారణమైన ఈవీపీ స్టూడియోను మూసేశారు. క్రేన్ డ్రైవర్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దర్శకుడు శంకర్, హీరో కమల్​ను విచారించారని సమాచారం.

ఇవీ చదవండి:

శంకర్​కు, నాకు కొద్దిలో చావు తప్పింది: కమల్ హాసన్​

Last Updated : Mar 2, 2020, 3:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.