ETV Bharat / sitara

'పవర్​స్టార్​తో సినిమానా?.. నా వల్ల కాదు!' - రామ్​గోపాల్​ వర్మ వకీల్​సాబ్

పవన్​కల్యాణ్​ ఇమేజ్​కు తగ్గట్టు సినిమా చేయడం తనకు రాదని అంటున్నారు దర్శకుడు రామ్​గోపాల్​ వర్మ. ఒకేలాంటి జోనర్​ సినిమాలు చేసే తనకు కమర్షియల్​ సినిమాలు తీయలేనని అన్నారు. అలాగే పవన్​ నటించిన 'వకీల్​సాబ్​' చిత్ర ట్రైలర్​ తనకు చాలా బాగా నచ్చిందని తెలిపారు.

Director Ram Gopal Varma says he can't do a film with Pawan Kalyan
'పవర్​స్టార్​తో సినిమానా?.. నా వల్ల కాదు!'
author img

By

Published : Apr 15, 2021, 11:39 AM IST

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ హీరోగా ఓ సినిమా చేయడం తనకు రాదని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అన్నారు. తాను 'వకీల్‌సాబ్‌' చిత్రాన్ని వీక్షించలేదని.. కానీ, సినిమాకు వచ్చిన రివ్యూల గురించి విన్నానని ఆయన తెలిపారు. 'దెయ్యం' ప్రమోషన్‌లో పాల్గొన్న ఆయన 'వకీల్‌సాబ్‌' చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

'వకీల్‌సాబ్‌' చిత్రాన్ని వీక్షించారా? అని విలేకరి ప్రశ్నించగా..‌ "సినిమాలపరంగా కాకుండా వ్యక్తిగతంగా నేను పవన్‌ అభిమానిని. పవన్‌ నటించిన సినిమాలు చాలా తక్కువ చూశాను. ఇటీవల విడుదలైన 'వకీల్‌సాబ్‌' కూడా చూడలేదు. కానీ, ట్రైలర్‌ చూశాను. బాగా నచ్చింది. అలాగే ఆ సినిమాకు వచ్చిన రివ్యూలు విన్నాను" అని ఆర్జీవీ తెలిపారు.

అనంతరం పవన్‌తో సినిమా చేయాలనే ఉద్దేశం మీకు ఏమైనా ఉందా? అని ప్రశ్నించగా.. "పవన్‌కు ఉన్న ఇమేజ్‌, హీరోయిజం, ఫ్యాన్‌ ఫాలోయింగ్‌, ఆయన అభిమానులకు ఉండే అంచనాలకు తగ్గట్టు సినిమా చేయడం నాకు చేతకాదు. ఎందుకంటే హీరోయిజం చూపించే కమర్షియల్‌ చిత్రాల కంటే ఎక్కువగా జోనర్‌ చిత్రాలను నేను తెరకెక్కిస్తాను. అలాంటి చిత్రాల్లో స్టార్‌ హీరోలను తీసుకుంటే అది వాళ్లకే కాదు.. సినిమాకు కూడా మంచిది కాదు. అలాగే, కమర్షియల్‌ హంగులతో చిత్రాలు తీయాలనే ఆసక్తి కూడా నాకు లేదు" అని రామ్‌గోపాల్‌ వర్మ వివరించారు.

'మర్డర్‌' తర్వాత రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం 'దెయ్యం'. ఈ చిత్రంలో రాజశేఖర్‌, స్వాతి దీక్షిత్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ ప్రతిఒక్కర్నీ ఆకట్టుకుంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

ఇదీ చూడండి: తలకిందులుగా తపస్సు చేస్తున్న సమంత!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.