ETV Bharat / sitara

'భీమ్లానాయక్​'కు 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్'​ స్పెషల్ థ్యాంక్స్ - పవన్​కల్యాణ్​ భీమ్లానాయక్​

Rajamouli thanks to Bheemlanayak: పెద్ద సినిమాల రిలీజ్​కు​ లైన్​క్లియర్​ చేస్తూ విడుదల తేదీని వాయిదా వేసుకున్న 'భీమ్లానాయక్'​ చిత్రబృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాయి 'ఆర్​ఆర్​ఆర్'​, 'రాధేశ్యామ్'​ చిత్రబృందాలు. పవన్​ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఆల్ ​ది బెస్ట్​ చెప్పాయి.

పవన్​కల్యాణ్​కు రాజమౌళి థ్యాంక్స్​, Director Rajamouli thanks to Pawankalyan
పవన్​కల్యాణ్​కు రాజమౌళి థ్యాంక్స్​
author img

By

Published : Dec 21, 2021, 3:53 PM IST

Rajamouli thanks to Pawankalyan: వచ్చే ఏడాది సంక్రాంతికి బరిలో దిగిన బడా సినిమాలు రిలీజ్​ క్లాష్​ కాకుండా విడుదల తేదీలు వాయిదా వేసుకున్నాయి. ఇప్పటికే మహేశ్​బాబు నటించిన 'సర్కారు వారి పాట' పండగ బరి నుంచి తప్పుకోగా.. తాజాగా పవన్​కల్యాణ్​ నటించిన 'భీమ్లానాయక్'​ కూడా రిలీజ్​ డేట్​ను మార్చుకుంది. ఈ సందర్భంగా తమ సినిమాలకు లైన్​క్లియర్​ చేస్తూ విడుదల తేదీని వాయిదా వేసుకున్న 'భీమ్లానాయక్'​ చిత్రబృందానికి ధన్యవాదాలు తెలిపాయి 'ఆర్​ఆర్​ఆర్'​, 'రాధేశ్యామ్​' మూవీటీమ్స్​.

"భీమ్లానాయక్​ రిలీజ్​డేట్​ను వాయిదా వేస్తూ చిన్నబాబు, పవన్​కల్యాణ్​ తీసుకున్న నిర్ణయం అభినందనీయం. చిత్రబృందానికి ధన్యవాదాలు. అలాగే ఈ చిత్రం కోసం 'ఎఫ్​ 3'ని కూడా పోస్ట్​పోన్​ చేసిన నిర్మాత దిల్​రాజుకు కృతజ్ఞతలు. అసలు సంక్రాంతికి వచ్చే సినిమాలు క్లాష్​ కాకుండా చొరవ తీసుకుంటూ తన చిత్రం 'సర్కారు వారి పాట'ను వేసవికి వాయిదా వేస్తూ ముందుగానే నిర్ణయం తీసుకున్న మహేశ్​ బాబు, అతని చిత్రబృందానికి థ్యాంక్స్​. ఇది సంక్రాంతికి విడుదవ్వాల్సిన సరైన సినిమా" అని రాజమౌళి పేర్కొన్నారు.

Director Rajamouli thanks to Pawankalyan
'భీమ్లానాయక్​'కు రాజమౌళి స్పెషల్​ థ్యాంక్స్​
UV creations thanks to Pawankalyan Bheemlayak movie
'భీమ్లానాయక్​'కు యూవీక్రియేషన్స్​ థ్యాంక్స్​

"మా విజ్ఞప్తిని స్వీకరించి 'భీమ్లానాయక్​'ను వాయిదా​ వేసినందుకు పవన్​కల్యాణ్​, సితార ఎంటర్​టైన్​మెంట్స్​కు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఫిబ్రవరి 25న విడుదల కానున్న మీ చిత్రానికి ఆల్​ ది బెస్ట్​"

-యూవీ క్రియేషన్స్​.

కాగా, ఎన్టీఆర్​, రామ్​చరణ్​ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఆర్​ఆర్​ఆర్'​ జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుండగా, ప్రభాస్​ 'రాధేశ్యామ్​' జనవరి 14న రిలీజ్​ కానుంది. 'భీమ్లా నాయక్' శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 25న విడుదల కానుంది.

ఇదీ చూడండి: సంక్రాంతి రేసు నుంచి 'భీమ్లా నాయక్' ఔట్.. కొత్త రిలీజ్ డేట్ ఇదే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.