ETV Bharat / sitara

'బాహుబలి' కిలికి భాష ఇకపై మీరూ నేర్చుకోవచ్చు - official kiLiKi language website

'బాహుబలి'లో వినిపించిన కిలికి భాష అధికారిక వెబ్​సైట్​ను దర్శకధీరుడు రాజమౌళి.. ఈరోజు ఆవిష్కరించాడు. ఇకపై అందరూ దీనిని నేర్చుకోవచ్చు.

official website for kiLiKi
కిలికి భాష వెబ్​సైట్ ఆవిష్కరిస్తున్న దర్శకుడు రాజమౌళి
author img

By

Published : Feb 21, 2020, 5:35 PM IST

Updated : Mar 2, 2020, 2:23 AM IST

'బాహుబలి' సిరీస్​... తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి చేర్చింది. ఎన్నో సరికొత్త రికార్డులను నమోదు చేసింది. అయితే తొలి భాగం విడుదలయ్యాక అందులోని కిలికి భాష గురించి ఎక్కువ మంది మాట్లాడుకున్నారు. విలన్ కాలకేయ చెప్పిన డైలాగ్​లు అనుకరిస్తూ వీడియోలను చేశారు. ఇప్పుడు ఆ భాషను అందరూ నేర్చుకునేలా ప్రత్యేక వెబ్​సైట్​ను రూపొందించారు. 'బాహుబలి' దర్శకుడు రాజమౌళి.. మాతృభాష దినోత్సవం సందర్భంగా నేడు దీనిని ఆవిష్కరించాడు. అనంతరం ఆ ఫొటోను ట్వీట్ చేశాడీ డైరెక్టర్.

Director Rajamouli launched official website for kiLiKi
కిలికి భాష వెబ్​సైట్ ఆవిష్కరిస్తున్న దర్శకుడు రాజమౌళి

'బాహుబలి' సిరీస్​లోని 'కిలికి' భాష కల్పితమైంది. తమిళ ప్రసిద్ధ గీత రచయిత, స్క్రీన్ రైటర్ మదన్ కార్కీ రూపొందించాడు. మనం రోజూవారీ వినియోగించే పదాల్లో నుంచి దీని కోసం 3 వేల పదాలను సృష్టించారు. 2013 నుంచి ఈ భాషపై పరిశోధన చేస్తున్న కార్కీ.. కిలికి కోసం 22 అక్షరాలతో ప్రత్యేక వర్ణమాలను తయారు చేశాడు. ఈ భాషకు శబ్దాలు, చిహ్నాలే ఆధారం. కార్కీ రీసెర్చ్ ఫౌండేషన్, లిఫో బృందం ట్రాన్స్కిప్ట్​ను తయారు చేసింది.

'కిలికి' భాష సైట్​ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి

Last Updated : Mar 2, 2020, 2:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.