ETV Bharat / sitara

'ఆర్‌.ఆర్‌.ఆర్‌’ అప్పుడే చూసేసిన జక్కన్న!

ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్​.ఆర్​.ఆర్​ సినిమాను జక్కన్న అప్పుడే చూసేశారట. ఎంతో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రానికి మాటలు అందిస్తున్న సాయుమాధవ్​ బుర్రా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంతకి సంగతేంటి?

DIRECTOR RAJAMOULI HAD ALREADY SEEN A RRR MOVIE
author img

By

Published : Oct 13, 2019, 6:16 AM IST

భారతీయ చిత్రసీమలోనే ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’. ‘బాహుబలి’ సిరీస్‌ వంటి హిట్‌ చిత్రాల తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోందీ చిత్రం. టాలీవుడ్​ టాప్​ హీరోలు ఎన్టీఆర్‌ - రామ్‌చరణ్‌ కథానాయకులు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని జక్కన్న ఎప్పుడో వీక్షించేశారంటున్నారు ప్రముఖ మాటల రచయిత సాయిమాధవ్‌ బుర్రా.

అదేంటి ఇంకా సెట్స్‌పైనే ఉన్న చిత్రాన్ని జక్కన్న అప్పుడే ఎలా చూసేశాడు అనుకుంటున్నారా? ఈ చిత్రానికి బుర్రానే సంభాషణలు అందిస్తున్నారు. ఈ ప్రముఖ రచయిత తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఇప్పటికే జక్కన్న ఈ చిత్రాన్ని తన మనోఫలకంపైన చూసేశారని, ఇప్పుడు ఆ అద్భుత దృశ్యకావ్యాన్ని మనకు చూపించడానికి తన వంతుగా ఏం చేయాలో అది చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

కథ గురించి బుర్రా మాటల్లోనే

"రాజమౌళి ఈ స్క్రిప్ట్‌ చెప్పినప్పుడు ఓ కథను ఇలా కూడా రాయొచ్చా అనిపించింది. అంత అద్భుతంగా ఉందీ కథ. ఈ స్క్రిప్ట్‌ విషయంలో ఆయన క్లారిటీ మహాద్భుతం. నిజానికి నేను ‘బాహుబలి’ చిత్రానికే జక్కన్నతో పనిచేయాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల అప్పుడు కుదరలేదు. ఎట్టకేలకు ఇంతటి గొప్ప చిత్రంతో మా కలయిక కుదిరింది."

సాయిమాధవ్​ బుర్రా, సినిమా రచయిత

ఇద్దరు వీరుల స్ఫూర్తి ఈ సినిమా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు చెందిన ఇద్దరు విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ల జీవితాల స్ఫూర్తితో ఓ ఫిక్షనల్‌ స్టోరీగా జక్కన్న ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అజయ్‌ దేవగణ్, సముద్రఖని, రాహుల్‌ రామకృష్ణ వంటి ప్రముఖ తారాగణం ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ అగ్ర కథానాయిక అలియా భట్‌ నటించనుంది. ఎన్టీఆర్‌కు కథానాయికను వెతికే పనిలో ఉంది చిత్ర బృందం.

ఇవీ చూడండి.. మహేశ్​ సినిమా ఫ్లాప్​పై దర్శకుడి సంచలన వ్యాఖ్యలు..

Gorakhpur (Uttar Pradesh), Oct 12 (ANI): Police recovered body of a minor from a drain. Police were looking for two brothers who were missing from UP's Shahpur since September 27. Gorakhpur SP, Kaustubh said, "Police was looking for two missing brothers. During the search, police found body of a 7-8 years old boy from the drain which was in disintegrated condition."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.