సామాజిక మాధ్యమాల్లో తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వస్తున్న వార్తలపై పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి అద్దె కట్టలేని దీనస్థితిలో నారాయణమూర్తి ఉన్నారంటూ పలు వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానల్స్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వాటిపై స్పందించిన నారాయణమూర్తి.. 'రైతన్న' సినిమా వేడుకలో ప్రజా గాయకుడు గద్దర్ వ్యాఖ్యలను వక్రీకరిస్తూ అవాస్తవాలు రాస్తున్నారని పేర్కొన్నారు. ఎంతోమంది దర్శకులు, ముఖ్యమంత్రులు ఇంటి స్థలాలు, కార్లు ఇప్పిస్తామన్నా సున్నితంగా తిరస్కరించానని తెలిపారు.
సినిమా వ్యవహారాలపై ప్రసాద్ ల్యాబ్‌కు రావడానికే నెలకు ఆటోకు రూ.30 వేలు ఖర్చుపెట్టే తాను.. ఇంటి అద్దె కట్టుకోలేనా? అని ప్రశ్నించారు. 36 ఏళ్లుగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించి కోట్లాది రూపాయలు సంపాదించానని, అయినా సాధారణ వ్యక్తిగా ఉండటానికే ఇష్టపడతానని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో తనపై అవాస్తవాలు రాయడం వల్ల ఎంతోమంది అభిమానులు కలత చెందారని, ఎవరూ తనకు ఆర్థిక సహాయం చేస్తానని ముందుకు రావద్దని నారాయణమూర్తి విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి: