ETV Bharat / sitara

పవన్​ సూచనతో మారిన హీరోయిన్ల పాత్రలు!

author img

By

Published : Apr 22, 2020, 10:09 AM IST

Updated : Apr 22, 2020, 11:58 AM IST

టాలీవుడ్​ దర్శకుల్లో పూరీ జగన్నాథ్​కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే అతడు తీసే ప్రతి చిత్రంతో ప్రేక్షకుల దగ్గరయ్యే పాత్రలను తెరకెక్కిస్తుంటారు. 'బద్రి'తో డైరక్టర్​గా పరిచయమై ఇటీవలే 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్​స్టాలో రేణు దేశాయ్​, పూరీ జగన్నాథ్​ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.

Director Puri Jagannadh revels About renu desai role in Badri Movie
నువ్వు ఆ పాత్రలో నటించాల్సింది కాదు!

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ సినీ కెరీర్‌లోని సూపర్​హిట్​ చిత్రాల్లో 'బద్రి'కి ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ సినిమాతోనే డైరక్టర్​గా పరిచయమయ్యాడు పూరీ జగన్నాథ్‌. ఏప్రిల్‌ 20కి ఈ చిత్రం విడుదలై, 20ఏళ్లు పూర్తయిన సందర్భంగా దర్శకుడు పూరీ‌.. ఆ సినిమా కథానాయికల్లో ఒకరైన రేణు దేశాయ్‌తో ఇన్‌స్టాలో ‌ముచ్చటించారు. తనకు 'బద్రి' రూపంలో ఎన్నో విలువైన జ్ఞాపకాలను అందించిన పూరీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు రేణు. ఈ సందర్భంగా రేణుతో మాట్లాడిన దర్శకుడు.. ఆమె చేసిన వెన్నెల పాత్రకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్తను వెల్లడించారు.

ఇందులో రేణును తొలుత సరయూ పాత్ర కోసం ఎంపిక చేశారట. వెన్నెల పాత్ర కోసం అమీషా పటేల్‌ను తీసుకున్నారట. తీరా సెట్స్‌లోకి వెళ్లాక రేణులోని కొంటెతనాన్ని, ఆమె వ్యక్తిత్వాన్ని గమనించిన పవన్‌‌.. ఆ పాత్రకు రేణు సరిపోతుందని, ఆమెతోనే దానిని చేయించమని పూరీకి సూచించారట. అలా చిత్రీకరణ సమయంలో పవన్‌ సూచన మేరకు.. సరయూ, వెన్నెల పాత్రల్లో మార్పులు జరిగాయట.

ఇదీ చూడండి.. 'రియల్ మెన్' అనిపించుకున్న చరణ్

Last Updated : Apr 22, 2020, 11:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.