ETV Bharat / sitara

పూరీ పాన్​వరల్డ్​ మూవీ.. రూమర్​ గర్ల్​ఫ్రెండ్​తో హృతిక్​ చిల్​! - హృతిక్​ రోషన్​ గర్ల్​ఫ్రెండ్​

Puri Jagannadh PanWorld movie: దర్శకుడు పూరీ జగన్నాథ్​ ఓ పాన్ వరల్డ్​ సినిమాను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. కాగా, బాలీవుడ్​ స్టార్​ హృతిక్​ రోషన్​ తన రూమర్​ గర్ల్​ఫ్రెండ్​ను ఇంటికి తీసుకెళ్లి కుటుంబసభ్యులతో ఎంజాయ్​ చేశారు.

Director Puri Jagannadh PanWorld movie
Director Puri Jagannadh PanWorld movie
author img

By

Published : Feb 21, 2022, 1:12 PM IST

Puri Jagannadh PanWorld movie: దర్శకుడు పూరీ జగన్నాథ్​ గురించి ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం 'లైగర్​' చిత్రంతో బిజీగా ఉన్న ఆయన ఓ అంతర్జాతీయ ప్రాజెక్ట్​ను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఛార్మితో కలిసి దీనిని నిర్మిస్తారని సమాచారం. 'లైగర్'​ తర్వాత ఆయన తన డ్రీమ్​ ప్రాజెక్ట్​ 'జనగణమన' సినిమాను తెరకెక్కించనున్నారు పూరీ. ఈ మూవీ తర్వాత ఆ పాన్​ వరల్డ్​ ప్రాజెక్ట్​ను ఆయన రూపొందిస్తారని సినీవర్గాల సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.

హృతిక్​ చిల్

Hrithik rohsan lover: బాలీవుడ్​ స్టార్​ హృతిక్​ రోషన్​ యువ హీరోయిన్​ సబా ఆజాద్​తో రిలేషన్​షిప్​లో ఉన్నాడంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. వీరిద్దరూ కలిసి పలు రెస్టారెంట్​, హోటళ్లలో కెమెరా కంటికి చిక్కుతున్నారు. అయితే తాజా సబాను తన ఇంటికి లంచ్​కు తీసుకెళ్లారు హృతిక్​. తన కుటుంబసభ్యులతో కలిసి ఎంజాయ్​ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను హీరో అంకుల్​ రాజేశ్​ రోషన్​ ఇన్​స్టాలో పోస్ట్​ చేశారు. 'సంతోషం అనేది ఎల్లప్పుడూ మన చుట్టూనే ఉంటుంది మరీ ముఖ్యంగా ఆదివారం, అందులోనూ మధ్యాహ్న భోజన సమయంలో' అని వ్యాఖ్య జోడించారు. 'అవును చాచా' అని హృతిక్​ బదులిచ్చారు.

ఇదీ చూడండి: ఈ హీరోయిన్..​ బికినీ పోజులతో పరేషాన్​ చేస్తోందిగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.