ETV Bharat / sitara

సైనికులే మన రియల్​ హీరోలు: పూరీ జగన్నాథ్ - latest movies of puri jagannath

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్​.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సైన్యం గురించి మాట్లాడారు. పోడ్​కాస్ట్​లో మాటల తూటాలు పేల్చారు.

DIRECTOR PURI JAGANNADH
పూరి జగన్నాథ్
author img

By

Published : Aug 15, 2020, 6:39 AM IST

పూరీ జగన్నాథ్‌.. మాటలు తూటాల్లా పేల్చడం గన్‌లా మారిన అతని పెన్‌కు బాగా తెలుసు. ప్రస్తుతం పోడ్‌కాస్ట్‌ ద్వారా తన మాటలతో ఎందరినో ఆకట్టుకుంటున్నారు. ఇటీవలే అల్లు అర్జున్‌ కూడా ఈ విషయమై అతడిని ప్రశంసించారు. ఈ క్రమంలోనే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత సైన్యం గురించి పూరీ మాట్లాడిన మాటలు.. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. యువత 'జనగణమన' అంటూ మద్దతు పలుకుతున్నారు. అసలు ఈ సంచలన దర్శకుడు ఏం చెప్పాడో ఆతని మాటల్లోనే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

"1895లో ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఇండియన్‌ ఆర్మీని ప్రారంభించింది. సిపాయి అనే పేరు పెట్టింది వాళ్లే. 1914లో మొదటి ప్రపంచం యుద్ధంలో భారతసైన్యం బ్రిటీష్‌వారి తరఫున పోరాడింది. ఇందులో 60 వేల మంది సైనికులు ప్రాణాలు విడిచారు. సేవలందిస్తున్నప్పుడు బుల్లెట్లు తగిలి 100 మంది వరకూ నర్సులు చనిపోయారు. భారతసైన్యంలో ప్రస్తుతం 10వేల మంది వరకూ మహిళలు వివిధ విభాగాల్లో ఉన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్‌, చైనాతో నాలుగు సార్లు యుద్ధాలు చేశాం. సియాచిన్‌లో మైనస్‌ 15 డిగ్రీల సెల్సియస్‌ చలిలో విధులు నిర్వహిస్తున్నారు మన సైనికులు. అక్కడ చలి తీవ్రతకు చేతివేళ్లు, చెవుల భాగాలు రాలిపోతుంటాయి. అలాంటి పరిస్థితుల్లో డ్యూటీ చేయాలంటే దమ్ముండాలి. దేశమంటే ప్రేముండాలి."

పూరీ జగన్నాథ్​, సినీ దర్శకుడు

"సియాచిన్‌లో పనిచేసే సైనికులు కన్పిస్తే నేను వాళ్ల కాళ్లు మొక్కుతా. యుద్ధాలే కాదు.. దేశంలో ఏ కష్టమొచ్చినా ధైర్యంగా నిలబడేది సైనికులే. రాజస్థాన్‌, మహారాష్ట్ర, హరియాణ, పంజాబ్‌ రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది భారతసైన్యంలో చేరతారు. వాళ్లు బయటికి ఎంత కరకుగా ఉన్నా.. మనసులు ఎంతో సున్నితం. మనలా వారిలో ఎలాంటి క్రిమినల్‌ ఆలోచనలు ఉండవు. మన కోసం వాళ్లు కుటుంబాలను వదిలి, ప్రాణాలు పణంగా పెట్టి దేశాన్ని రక్షిస్తున్నారు. వాళ్లు ఏ రైల్వేస్టేషన్‌లోనో కన్పిస్తే...సెల్యూట్‌ చేయండి. వారితో సెల్ఫీ దిగండి. వారి యోగ క్షేమాలు తెలుసుకోండి. ఎందుకంటే వాళ్లే రియల్‌ హీరోలు. జనగణమన." అంటూ పూరీ యువతకు సందేశమిచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.