ETV Bharat / sitara

'ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు'

తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'జాంబీరెడ్డి'. నేడు (ఫిబ్రవరి 5) థియేటర్లలో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో విలేకర్లతో ముచ్చటించిన ప్రశాంత్ వర్మ పలు విషయాలు పంచుకున్నారు.

Prashanth Varma
ప్రశాంత్ వర్మ
author img

By

Published : Feb 5, 2021, 6:39 AM IST

"కొత్త కథలతో ప్రయాణం చేయడాన్ని నేనెంతో ఆస్వాదిస్తా. ఇది ప్రేక్షకులకి ఎక్కుతుందా.. లేదా? అని ఎక్కువ ఆలోచించను. సాధ్యమైనంత వరకు ఆ కొత్తదనాన్ని ప్రేక్షకులకు ఈజీగా అర్థమయ్యేలా చూపించాలి అనుకుంటా" అన్నారు ప్రశాంత్‌ వర్మ. 'అ!', 'కల్కి' లాంటి వైవిధ్యభరిత చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడాయన. ఇప్పుడు అదే పంథాలో 'జాంబీరెడ్డి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సినిమాతోనే తెలుగు తెరకు హీరోగా పరిచయమవుతున్నారు బాల నటుడు తేజ సజ్జా. ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు ప్రశాంత్‌ వర్మ. ఆ విశేషాలివీ..

  • "ఓటీటీల వల్ల ప్రేక్షకులకి చాలా కొత్త కంటెంట్‌ దొరుకుతుంది. కాబట్టి వాళ్లనిప్పుడు థియేటర్లకు తీసుకురావాలంటే.. అంతకు మించిన కొత్తదనం చూపించాల్సిందే. మా 'జాంబీరెడ్డి' అలాంటి కొత్తదనం నిండిన చిత్రమే. జాంబీ జానర్‌లో వస్తున్న తొలి తెలుగు చిత్రమిది. రెండున్నర గంటల పాటు భయపెడుతూ కడుపుబ్బా నవ్విస్తుంది".
  • "జాంబీ జానర్‌ హాలీవుడ్‌కు చెందినదే అయినా.. ఈ సినిమా దేనికీ రీమేక్‌ కాదు. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా జాంబీ జానర్‌ని సరికొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఈ కథకి సరిగ్గా సరిపోతాడనిపించే తేజని హీరోగా ఎంచుకున్నాం. నిజానికి తనతో 'అ!'కి ముందే ఓ సినిమా చెయ్యాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల అప్పుడది కుదర్లేదు. రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో సాగే జాంబీ చిత్రం కాబట్టి శక్తిమంతంగా ఉంటుందని 'జాంబీరెడ్డి' అన్న టైటిల్‌ పెట్టాం. ఎవరినీ కించపరిచేలా ఉండదు. జాంబీల ముప్పు నుంచి ప్రపంచాన్ని రాయలసీమ రెడ్లు ఎలా కాపాడారన్నట్లుగా చూపించాం."
  • "ప్రస్తుత కాలంలో ప్రయోగాలు చేయడమే మంచిదనిపిస్తోంది. రొటీన్‌ చిత్రాలు చేయడం ప్రయోగంలా కనిపిస్తోంది. ఎందుకంటే ఈతరం ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు. నేనికపై విభిన్న కథాంశాల్నే చెప్పినా.. వాణిజ్యాంశాలు పుష్కలంగా ఉండేలా చూసుకుంటా. 'అ!'లాంటి సూపర్‌ క్రేజీ కథల్ని ఓటీటీకి చేస్తా. ఆ మధ్య సమంతకి ఓ వైవిధ్యభరిత కథని వినిపించా. తనకీ బాగా నచ్చింది. కానీ దాన్ని పట్టాలెక్కించడానికి నిర్మాత దొరకలేదు. ప్రస్తుతం 'జాంబీరెడ్డి'కి సీక్వెల్‌గా 'జాంబీరెడ్డి: రివేంజ్‌ ఆఫ్‌ ది డెడ్‌'ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. స్క్రిప్ట్‌ పనులు జరుగుతున్నాయి. 'అ!'కి సీక్వెల్‌ తీసుకొస్తా. పాన్‌ ఇండియా స్థాయిలో తీయదగ్గ కథలూ సిద్ధం చేసి పెట్టుకున్నా".
    • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.