ETV Bharat / sitara

థియేటర్లోనే విడుదల కానున్న 'జగమే తంత్రం‌' - కార్తిక్ సుబ్బరాజ్ వార్తలు

తమిళ నటుడు ధనుష్ హీరోగా కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'జగమే తంత్రం'. కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. తాజాగా ఈ చిత్ర విడుదలపై స్పందించాడు దర్శకుడు కార్తిక్.

Director Kartik Subabraj About Jagame Tantram release
జగమే తంత్రం
author img

By

Published : Jun 18, 2020, 11:13 AM IST

తమిళ నటుడు ధనుష్‌ హీరోగా కార్తిక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'జగమే తంత్రం'‌. వైనాట్‌ స్టూడియోస్‌ పతాకంపై నిర్మితమౌతున్న ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మీ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై స్పందించాడు దర్శకుడు కార్తిక్.

"మేం 'జగమే తంత్రం' చిత్రాన్ని ఓటీటీ వేదిక ద్వారా విడుదల చేయాలని భావించడం లేదు. మళ్లీ ప్రేక్షకులు సినిమా థియేటర్లోకి వస్తారనే నమ్మకం మాకు ఉంది. థియేటర్లు తెరుచుకోగానే మా చిత్రం తెరపైనే విడుదల చేస్తాం. సినిమా అనేది థియేటర్లోనే చూడాలి. అప్పుడే ప్రేక్షకుడి అనుభూతి అదోలా ఉంటుంది."

-కార్తిక్ సుబ్బరాజ్, దర్శకుడు

ధనుష్‌ నటించిన 'జగమే తంత్రం'‌ ఈ ఏడాది మేనెల్లోనే తెరపైకి రావాల్సి ఉంది. కొవిడ్‌-19 మహమ్మారి వల్ల మా సినిమా థియేటర్లోకి రాలేకపోయిందని గత నెల్లో కార్తిక్‌ ట్విట్టర్లో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఆయన సమర్పణలో కీర్తి సురేష్‌ నటించిన 'పెంగ్విన్' చిత్రం రేపు (19న) అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈశ్వర్‌ కార్తిక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే టీజర్‌, ట్రైలర్‌ విడుదలై ఆకట్టుకున్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.