తమిళ రొమాంటిక్ హిట్ 'విన్నైతాండ వరువాయ' (ఏ మాయ చేశావే) సినిమాకు సీక్వెల్ సిద్ధమైందని చెప్పారు ప్రముఖ దర్శకుడు గౌతమ్ మేనన్. దీనితో పాటే తాను తీసిన 'రాఘవన్', 'ఎంతవాడు గానీ' చిత్రాలకు కొనసాగింపు కథలు తయారు చేశానని చెప్పారు. ఇటీవలే జరిగిన ఓ లైవ్ సెషన్లో మాట్లాడుతూ ఈ విషయాల్ని స్పష్టం చేశారు.
2010లో 'విన్నైతాండ వరువాయ'లో శింబు, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు. ఇదే సినిమాను తెలుగులో నాగచైతన్య, సమంతలతో రీమేక్ చేశారు. ఇలా రెండు భాషల్లోనూ ప్రేక్షకులను ఆదరించిందీ చిత్రం. కథానాయకుడు శింబు సరేనన్న వెంటనే ప్రాజెక్టు పట్టాలెక్కిస్తానని చెప్పారు మేనన్. అయితే ఇందులో హీరోయిన్గా అనుష్క శెట్టి నటించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.
