ETV Bharat / sitara

ఆ దర్శకుడి సినిమా సెట్​లో కుర్చీలకు నో ఛాన్స్

హాలీవుడ్​ దర్శకుడు క్రిస్టోఫర్​ నోలాన్ సినిమా​ సెట్​లో ఉంటే అక్కడ కుర్చీలు ఉండవు. ఎవరినీ సెల్​ఫోన్లు కూడా మాట్లాడనివ్వడు. అసలు దీని వెనకున్న వచ్చిందనే విషయాల్ని నటి అన్నా హాత్వే వెల్లడించింది.

director Christopher
క్రిస్టోఫర్​ నొలాన్
author img

By

Published : Aug 13, 2020, 12:05 PM IST

హాలీవుడ్​ నటి​ అన్నా హాత్వే.. ప్రముఖ​ దర్శకుడు క్రిస్టోఫర్​ నోలాన్​ గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది. అతడు షూటింగ్​లో స్పాట్​లో కుర్చీలు అసలు ఉండనీయడని తెలిపింది. అవి ఉంటే పనిచేసేవాళ్లు కాస్త వాటిలో కూర్చొని విశ్రాంతి తీసుకుంటారనేది అతడి అభిప్రాయమని వెల్లడించింది. పనివేళల్లో సెల్​ఫోన్లను కూడా అనుమతివ్వడని చెప్పింది.

"షూటింగ్​ స్పాట్​లో నోలన్​​ కుర్చీలు ఉండనివ్వరు. నటీనటులు సిబ్బందిని అస్సలు కూర్చోనివ్వడు. అవి ఉంటే పనిచేసేవారు కాస్త దానిని మానేసి తాపీగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటారని అతడి అభిప్రాయం"

-అన్నా హాత్వే, హాలీవుడ్​ నటి

క్రిస్టోఫర్ నోలన్ సినిమాల్లో సాంకేతిక, సందేశాత్మక అంశాలు ఉంటాయని కితాబిచ్చింది అన్నా. అతడో వైవిధ్యమైన దర్శకుడని ప్రశంసించింది.

క్రిస్టోఫర్​ దర్శకత్వంలో 'ది డార్క్​ నైట్​ రైజస్'​, 'ఇంటర్​స్టెల్లర్'​ సినిమాల్లో నటించింది అన్నా. ప్రస్తుతం సైన్స్​ ఫిక్షన్​ నేపథ్య కథతో 'టెనెట్'ను తెరకెక్కించారు నోలాన్​. కరోనా ప్రభావంతో వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం.. ఆగస్టు 26న విడుదల కానుంది.

ఇది చూడండి అమెరికా కంటే ముందే భారత్​లో ఆ సినిమా​ విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.